క్రీడాకారుల కోసం క్రీడా ప్రాంగణాలు

ABN , First Publish Date - 2022-05-21T03:19:53+05:30 IST

జిల్లాలో క్రీడాకారు లను ప్రొత్సహించేందుకు క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. శుక్ర వారం కాగజ్‌నగర్‌ మండలం వంజీరిగ్రామంలో క్రీడాప్రాంగణం కోసం గుర్తించిన భూమిని అదన పుకలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.

క్రీడాకారుల కోసం క్రీడా ప్రాంగణాలు
క్రీడాస్థలాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

-కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌  

కాగజ్‌నగర్‌, మే 20: జిల్లాలో క్రీడాకారు లను ప్రొత్సహించేందుకు క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. శుక్ర వారం కాగజ్‌నగర్‌ మండలం వంజీరిగ్రామంలో క్రీడాప్రాంగణం కోసం గుర్తించిన భూమిని అదన పుకలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. జూన్‌3 నుంచి పట్టణప్రగతి కార్యక్రమం ప్రారంభం కానున్నందున కాగజ్‌నగర్‌ పట్టణంలోని 9,20,26వార్డుల్లో పర్యటించి ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలపై అడిగి తెలుసుకోను న్నారు. వైకుంఠ దామాలు, పారిశుధ్య నిర్వహణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిస్థాయిలో చేసే విధంగా సంబంధిత శాఖల అధికారులు కార్యాచరణ తయారు చేయాలని ఆదేశించారు.

Updated Date - 2022-05-21T03:19:53+05:30 IST