క్రీడాకారులకు క్రీడాదుస్తులు పంపిణీ

ABN , First Publish Date - 2021-02-27T06:12:52+05:30 IST

మండలకేంద్రమైన దొనకొండలోని ఒబ్బాపురానికి చెందిన పుట్‌బాల్‌ క్రీడాకారులకు దొనకొండ సర్పంచ్‌ కొంగలేటి.గ్రే్‌సరత్నకుమారి, 9వ వార్డు సభ్యుడు బొందల.రాజు సహకారంతో సమకూర్చిన క్రీడాదుస్తులను సచివాలయంలో శుక్రవారం పంపిణీ చేశారు.

క్రీడాకారులకు క్రీడాదుస్తులు పంపిణీ
క్రీడాదుస్తులు పంపిణీ చేసిన సర్పంచ్‌ గ్రేస్‌రత్నకుమారి

దొనకొండ, ఫిబ్రవరి 26 : మండలకేంద్రమైన దొనకొండలోని ఒబ్బాపురానికి చెందిన పుట్‌బాల్‌ క్రీడాకారులకు దొనకొండ సర్పంచ్‌ కొంగలేటి.గ్రే్‌సరత్నకుమారి, 9వ వార్డు సభ్యుడు బొందల.రాజు సహకారంతో సమకూర్చిన క్రీడాదుస్తులను సచివాలయంలో శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ గ్రేస్‌రత్నకుమారి మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. పొటీల్లో మంచి ప్రతిభ కనబరిచి దొనకొండకు పేరు తేవాలని ఆకాంక్షించారు. దాదాపు  రూ.7వేల విలువైన క్రీడాదుస్తులను ఈ సందర్భంగా వారు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు కొంగలేటి దేవానంద్‌, 108 వాహన పైలెట్‌ మురికిపూడి జాన్‌పీటర్‌, పుట్‌బాల్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T06:12:52+05:30 IST