Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

- సింగరేణిలో కంపెనీ స్థాయి క్రీడాపోటీలు

గోదావరిఖని, డిసెంబరు 2: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఆర్‌జీ-1 ఇన్‌చార్జీ జీఎం కేవీరావు అన్నారు. సింగరేణి వర్క్‌ పీపుల్స్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన కంపెనీ స్థాయి క్రీడా పోటీలను ఆయన జెండావిష్కరణ చేసి వాలీబాల్‌ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శరీర దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని, క్రీడా పోటీల్లో ప్రతి   ఒక్కరూ గెలుపు ఓటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. క్రీడల్లో ముందుకు సాగాలంటే సాధననే ముఖ్యమని తెలిపారు. 

- 11ఏరియాల నుంచి హాజరు..

జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో నిర్వహిస్తున్న వాలీబాల్‌ పోటీలకు సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. శుక్రవారం ఫైనల్స్‌ పోటీలు ఉంటాయి. ఫైనల్స్‌లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతుల పంపిణీతో పాటు కోల్‌ ఇండియాలో జరిగే పోటీలకు ఎంపిక జరుగుతుంది. కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్‌రావు, సీఎంఓఏఐ అధ్యక్షులు పొనగోటి శ్రీనివాస్‌, ఎస్‌ఓటూ జీఎం త్యాగరాజు, డీజీఎంలు లక్ష్మీనారాయణ, నవీన్‌, అభిలాష్‌, మదన్‌మోహన్‌, డీవైసీఎంఓ కిరణ్‌రాజ్‌కుమార్‌, స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్‌ సుందర్‌రాజు, కార్యదర్శి బంగారు సారంగపాణి, పర్స శ్రీనివాస్‌, జాన్‌ కెనడి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement