మానసికోల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయి

ABN , First Publish Date - 2022-08-19T04:17:19+05:30 IST

శారీరక దారు ఢ్యానికి, మానసికోల్లాసానికి క్రీడలుఎంతో దోహదప డుతాయని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన ఆటల పోటీలకు అదనపుకలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, ఎస్పీ సురేష్‌కుమార్‌, ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు.

మానసికోల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయి
టాస్‌ వేస్తున్న ఎస్పీ, కలెక్టర్‌

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఆగస్టు 18: శారీరక దారు ఢ్యానికి, మానసికోల్లాసానికి క్రీడలుఎంతో దోహదప డుతాయని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన ఆటల పోటీలకు అదనపుకలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, ఎస్పీ సురేష్‌కుమార్‌, ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలె క్టర్‌ మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు, క్రీడా కారుల మధ్య స్నేహభావం పెంపొందడానికి ఉప యోగపడతాయన్నారు. అంతకుముందు కలెక్టర్‌, ఎస్పీల మధ్య క్రికెట్‌ పోటీలు జరుగగా కలెక్టర్‌ జట్టు గెలుపొందింది. వాలీబాల్‌పోటీల్లో బెజ్జూరు, తిర్యా ణిపై విజయం సాధించింది. క్రీడాపోటీలలో గెలుపొం దిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎమ్మెల్యే ఆత్రంసక్కు, ఏఎస్పీఅచ్చేశ్వర్‌రావు, జడ్పీటీసీ అరిగెలనాగేశ్వర్‌రావు,ఎంపీపీమల్లికార్జున్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T04:17:19+05:30 IST