రైటప్ ట్రాన్స్‌కో ఉద్యోగుల క్రీడాపోటీల ప్రారంభోత్సవంలో ఎ.ఇ.డి. శ్రీనాధుడు
కడప (మారుతీనగర్), జనవరి 21: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని కడప ట్రాన్స్‌కో ఏఈడీ శ్రీనాథుడు పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భం పురస్కరించుకుని ఏపీ ట్రాన్స్‌కో కడప జోన్ సీఈ ఆధ్వర్యంలో 21నుంచి 25 వరకు పలు క్రీడాపోటీలు (క్రికెట్, షటిల్, బాల్‌బాట్మింటన్, క్యారెమ్స్, చెస్, టేబుల్‌టెన్నిస్) నిర్వహిం చనున్నారు. అందులో భాగంగా శుక్రవారం కడప డీఎస్ఏ మైదానంలో క్రికెట్ పోటీ లు నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ నిత్యం విధినిర్వహణలో తలమునకలవుతున్న విద్యుత్ ఉద్యోగులకు కాసింత ఆటవిడుపుగా క్రీడల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ట్రాన్స్‌కో ఈఈ గిరిధర్, ఏఈ వెంకటరమణ, గోవిందరాజులు, మస్తాన్, వీరాంజనేయులు, కె.వెంకటరమణ పోటీలను ప్రారంభించారు. కాగా క్రికెట్లో యర్రగుంట్ల జట్టుపై పులివెందుల జట్టు, కడప-1 జట్టుపై తిరుపతి జట్టు, కడప-2 జట్టుపై తలమంచిపట్నం జట్టు విజయం సాధించాయి. కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.