కూర్చునే భంగిమ సరిగ్గా లేకపోతే...

ABN , First Publish Date - 2021-07-22T17:50:30+05:30 IST

కాసేపు ఒకే చోట కూర్చుని పనిచేస్తే మెడనొప్పి వస్తుంది. మరి ఆఫీసుల్లో గంటల కొద్దీ కూర్చుని పనిచేసే వారి పరిస్థితి ఏంటి? సోఫాలో, బెడ్‌పైన కూర్చుని వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసే వాళ్ల పరిస్థితి ఏంటి? మెడనొప్పి, నడుంనొప్పితో వాళ్లు రోజూ ఇబ్బంది పడి పోతుంటారు. ఈ సమస్యను స్పాండిలైటిస్‌ అంటారు

కూర్చునే భంగిమ సరిగ్గా లేకపోతే...

ఆంధ్రజ్యోతి(22-07-2021)

కాసేపు ఒకే చోట కూర్చుని పనిచేస్తే మెడనొప్పి వస్తుంది. మరి ఆఫీసుల్లో గంటల కొద్దీ కూర్చుని పనిచేసే వారి పరిస్థితి ఏంటి? సోఫాలో, బెడ్‌పైన కూర్చుని వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసే వాళ్ల పరిస్థితి ఏంటి? మెడనొప్పి, నడుంనొప్పితో వాళ్లు రోజూ ఇబ్బంది పడి పోతుంటారు. ఈ సమస్యను స్పాండిలైటిస్‌ అంటారు. అయితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ పరిస్థితి రాకుండా చూసుకోవచ్చు.


కూర్చునే సీటు సౌకర్యవంతంగా ఉండాలి. ఎత్తు సరిగ్గా ఉండాలి. పాదాలు నేలపై ఆనాలి. కుర్చీకి తప్పసరిగా బ్యాక్‌ రెస్ట్‌ ఉండాలి. పిల్లో లేదా టవల్‌ను బ్యాక్‌కు సపోర్టుగా పెట్టుకోవాలి. 


మానిటర్‌ 16 నుంచి 30 అంగుళాల దూరంలో ఉండాలి. స్ర్కీన్‌ పై భాగం కంటి ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. 


ప్రతి గంటకోసారి చిన్న బ్రేక్‌ తీసుకోవాలి. లేచి రెండు నిమిషాలు నడవడం, ఇతర పనులు చేయడం, చేతులు, కాళ్లకు సంబంధించిన స్ట్రెచింగ్‌ వ్యాయామాలు చేయాలి.


కూర్చునే భంగిమ సరిగ్గా ఉండాలి. నిటారుగా కూర్చోవాలి. వాలిపోయినట్టుగా కూర్చోవద్దు. సీటుకు వెనక్కి వాలి కూర్చోకూడదు.


 తరచుగా కదలికలు ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల కీళ్లలో స్టిఫ్‌నెస్‌ ఏర్పడకుండా ఉంటుంది. రక్తసరఫరా పెరుగుతుంది.


రోజూ ఉదయం వ్యాయామం చేయాలి. ఫిట్‌గా ఉన్నప్పుడే ఎనిమిది గంటల పాటు ఉద్యోగం చేయగలుగుతారు. సైక్లింగ్‌, స్విమ్మింగ్‌, ఏరోబిక్స్‌, స్కిప్పింగ్‌ లాంటివి కూడా చేయవచ్చు. 


నొప్పి తగ్గకుండా ఉంటే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి. ఫిజియోథెరపీతో ఉపశమనం లభిస్తుంది.


Updated Date - 2021-07-22T17:50:30+05:30 IST