Advertisement
Advertisement
Abn logo
Advertisement

వేతనాలు ఇప్పించాలని ఎస్పీవోల వినతి

జగ్గయ్యపేట, డిసెంబరు 4: ఎనిమిది నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే వేతనాలు ఇప్పించాలని ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌కు శనివారం రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులలో పనిచేస్తున్న ఎస్పీవోలు వినతిపత్రం అందజేశారు. పోలీస్‌శాఖకు అండదండలుగా రేయింబవళ్లు తెలంగాణ మద్యం, ఇసుక అనధికార రవాణా నియంత్రణకు కష్టించి పనిచేస్తున్నా, ప్రతి నెల వేతనాలు రాకపోవటం వల్ల కుటుంబ పోషణ భారంగా మారిందని ఎస్పీకి విన్నవించారు.


Advertisement
Advertisement