Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాలువలో పడి వ్యక్తి మృతి

త్రిపురాంతకం, డిసెంబరు 2 : స్నానానికి కాలువలో దిగి ఈతరాక నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందా డు. ఈ సంఘటన మండలంలోని గణపవరం వద్ద ముడివేముల మేజరులో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థుల కథనం మేరకు... గణపవరం గ్రామానికి చెందిన చింతల చిన్నగురవయ్య(44) కాలువ పక్కనే ఉన్న తన పొలంలో బుధవా రం సాయంత్రం వరకూ పని చేసి తర్వాత స్నానానికి కాలువలోకి దిగా డు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఈతరాక మునిగిపోయి మృతి చెందాడు. గురువారం ఉదయం మృతదేహం పైకి తేలడంతో గురవయ్య బంధువులు గ్రామస్థులు గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని వై.పాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా గురవయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 


అనుమానాస్పదస్థితిలో వ్యక్తి ఆత్మహత్య

వలేటివారిపాలెం, డిసెంబరు 2 : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన వలేటివారిపాలెంలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని అరుంధతీనగర్‌కు చెందిన కొంతమంది వలేటివారిపాలెంలోని గాంధీనగర్‌లో వాటర్‌ట్యాంక్‌ నిర్మాణానికి బేల్దారి పనులు నిమిత్తం వచ్చారు. వారిలో మేస్ర్తీ జోజీతో పాటు ఏసుపాదం(32) ఆయన భార్య కూలీలుగా వచ్చారు. ఈ క్రమంలో జోజీ ఏసుపాదం భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఏసుపాదానికి, ఆయన భార్యకు మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఏసుపాదం బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏసుపాదం మృతికి ఆయన భార్యతో జోజికి ఉన్న వివాహేతర సంబంధమే కారణమని ఏసుపాదం తమ్ముడు రాజు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని కుందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  

Advertisement
Advertisement