దెబ్బతిన్న చెరువులకు మరమ్మతులు- అధికారులతో కమిటీ ఏర్పాటు

ABN , First Publish Date - 2020-11-01T00:30:56+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావం నగరంపై పడింది.

దెబ్బతిన్న చెరువులకు మరమ్మతులు- అధికారులతో కమిటీ ఏర్పాటు

హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావం నగరంపై పడింది. ఈ సందర్భంగా చెరువుల పటిష్టతను పరిశీలించి, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్రావు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి తారకరామారావు ఆదేశాలకు అనుగుణంగా 15 మంది ఇంజనీర్లు, అధికారులతో నీటి పారుదల శాఖ ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ నిపుణుల బృందం హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న 185 చెరువులు, కుంటలతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 7 చెరువులను తనిఖీ చేసింది. ఆయా చెరువుల స్థితిపై నివేదిక రూపొందించింది. భారీ వర్షాల వలన 14 చెరువులకు గండ్లు పడ్డాయని, 6 చెరువులు క్రిటికల్ స్టేజ్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 27 తూములు, 32 చెరువుల కట్టలు, 31 చెరువుల అలుగులు దెబ్బతిన్నాయి.


గండ్లు పడిన, దెబ్బతిన్న చెరువుల రక్షణకు అత్యవసర మరమ్మతులకై రూ. 9 కోట్ల 84 లక్షల 50 వేలు, శాశ్వత మరమ్మతులకు  రూ. 31 కోట్ల 64 లక్షలు నిధులు అవసరమవుతాయని తెలిపారు. భారీ వర్షాల ధాటికి దెబ్బతిన్న 9 చెరువులు పల్లె చెరువు, మైలార్ దేవ్ పల్లి, బండ్లగూడ (మండలం),  గుర్రం చెరువు, బార్కాస్, బండ్లగూడ(మండలం), అప్పా చెరువు, గగన్ పహాడ్, రాజేంద్రనగర్ (మండల్), సూరం చెరువు, బండ్లగూడ (గ్రా, మండలం), ఎర్రకుంట లక్మ్షిగూడ, రాజేంద్రనగర్ (మండలం), కుమ్మరికుంట, అమ్మగల్, హయత్ నగర్ (మండలం), చిన్న పెద్ద చెరువు, గోపన్ పల్లి, శేరిలింగంపల్లి (మండలం), కొత్తకుంట, హఫీజ్ పేట్, శేరిలింగంపల్లి (మండలం), తిమ్మక్క చెరువు, పటాన్ చెరు, (గ్రా, మండలం) సంరక్షించుటకు యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేశారు. 

Updated Date - 2020-11-01T00:30:56+05:30 IST