Viral Video: కోతికి కోపం వస్తే ఇలాగే ఉంటుంది.. డిస్ట్రబ్ చేసిన బాలికకు బుద్ధి చెప్పిన వానరం!

ABN , First Publish Date - 2022-07-25T02:14:50+05:30 IST

జంతు ప్రదర్శనశాల (Zoo)కు వెళ్లిన వాళ్లు అక్కడి జంతువులను చూసి వచ్చేయకుండా వాటిని డిస్ట్రబ్ చేస్తుంటారు.

Viral Video: కోతికి కోపం వస్తే ఇలాగే ఉంటుంది.. డిస్ట్రబ్ చేసిన బాలికకు బుద్ధి చెప్పిన వానరం!

జంతు ప్రదర్శనశాల (Zoo)కు వెళ్లిన వాళ్లు అక్కడి జంతువులను చూసి వచ్చేయకుండా వాటిని డిస్ట్రబ్ చేస్తుంటారు. వాటితో ఫొటోలు దిగేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లల అల్లరికి హద్దులే ఉండవు. బోన్లు, ఎన్‌క్లోజర్లలో ఉండే జంతువులు బయటకు రాలేవులే అనే ధీమాతో అతిగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా అలా ప్రవర్తించిన ఓ బాలికకు ఓ వానరం బుద్ధి చెప్పింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో (Viral Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  


ఇది కూడా చదవండి..

Heart touching video: డ్యాన్స్ చేస్తూ పడిపోయిన యువతి.. ఆ తర్వాత ఆమె తండ్రి ఏం చేశాడంటే.. ఆకట్టుకుంటున్న వైరల్ వీడియో!


ఒక బాలిక జూలోని స్పైడర్ కోతులు (Spider monkeys) ఉన్న ఎన్‌క్లోజర్‌ వద్దకు వెళ్లింది. తన మొబైల్‌ ఫోన్‌లో వాటి ఫొటోలు తీసింది. అనంతరం వాటితో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించింది. తన చేతితో ఎన్‌క్లోజర్‌ను పలుమార్లు కొట్టింది. ఆ అమ్మాయి చర్య ఒక కోతికి ఆగ్రహం తెప్పించింది. అది లోపలి నుంచే ఆ బాలిక జుట్టు పట్టుకుంది. ఎన్‌క్లోజర్‌కు దగ్గరగా ఆమెను లాగేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ యువతి కేకలు వేసింది. అక్కడే ఉన్న ఒక వ్యక్తి కోతి బారి నుంచి ఆమెను కాపాడాడు. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ అవుతోంది. 



Updated Date - 2022-07-25T02:14:50+05:30 IST