జులై 12-26 మధ్య యూఏఈకి స్పైస్‌జెట్ విమాన సర్వీసులు

ABN , First Publish Date - 2020-07-12T01:38:02+05:30 IST

అర్హత కలిగిన ఐసీఏ అనుమతి పొందిన యూఏఈ పౌరుల కోసం ఈ నెల 12 (ఆదివారం) నుంచి 26వ తేదీ మధ్య

జులై 12-26 మధ్య యూఏఈకి స్పైస్‌జెట్ విమాన సర్వీసులు

న్యూఢిల్లీ: అర్హత కలిగిన ఐసీఏ అనుమతి పొందిన యూఏఈ పౌరుల కోసం ఈ నెల 12 (ఆదివారం) నుంచి 26వ తేదీ మధ్య యూఏఈకి విమాన సర్వీసులు నడవనున్నట్టు ప్రైవేటు విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తెలిపింది. ఐసీఏ అనేది యూఏఈ ఫెడరల్ అథారిటీ గుర్తింపు, పౌరసత్వానికి సంబంధించినది. చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ పర్మిట్ ఉన్న ప్రయాణికుడు విమానంలో దేశంలోకి అడుగుపెట్టాలంటే ఐసీఏ అనుమతి తప్పనిసరి. కాగా, ఢిల్లీ, ముంబై, కోజికోడ్, కొచ్చి తదితర నాలుగు నగరాల నుంచి యూఏఈకి విమాన సర్వీసులు నడుపుతామని శనివారం స్పైస్‌జెట్ తెలిపింది. 


ఈ విమానాలు యూఏఈకి ప్రయాణించే వారికి మాత్రమేనని స్పైస్‌జెట్ పేర్కొంది. అలాగే, రస్ అల్ ఖైమా విమానాశ్రయం నుంచి దుబాయ్, షార్జా, అబుధాబి వెళ్లే వారికి ఉచితంగా కోచ్‌లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. కాగా, కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను భారత్ ఈ ఏడాది మార్చి 23 నుంచి నిలిపివేసింది.  

Updated Date - 2020-07-12T01:38:02+05:30 IST