Spicejet : ఆనందం ఒక్కరోజు కూడా నిలవలేదు.. షేర్లు 6 శాతం ఢమాల్..

ABN , First Publish Date - 2022-08-04T20:08:05+05:30 IST

స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్(SpiceJet promoter Ajay Singh) కంపెనీలో కొంత వాటా విక్రయానికి అవకాశం ఉందని వెల్లడించడంతో..

Spicejet : ఆనందం ఒక్కరోజు కూడా నిలవలేదు.. షేర్లు 6 శాతం ఢమాల్..

Spicejet Shares : స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్(SpiceJet promoter Ajay Singh) కంపెనీలో కొంత వాటా విక్రయానికి అవకాశం ఉందని వెల్లడించడంతో కంపెనీ షేర్లు(Spicejet Shares) బుధవారం ఏకంగా 18 శాతం పెరిగిన విషయం తెలిసిందే. ఆ ఆనందం ఒక్కరోజు కూడా నిలవలేదు. నేడు కంపెనీ షేర్లు దారుణ పతనాన్ని చూశాయి. నేటి మధ్యాహ్నం సెషన్‌(Afternoon Session)లో స్పైస్‌జెట్ షేర్లు 6 శాతానికి పైగా పతనమయ్యాయి. స్పైస్‌జెట్ స్టాక్(Spicejet Stock) బీఎస్‌ఈ(BSE)లో క్రితం ముగింపు రూ.50.05తో పోలిస్తే ఈరోజు 6.29 శాతం వరకు పడిపోయి రూ.46.9కి చేరుకుంది.


నాలుగు రోజుల లాభాల తర్వాత ఈ స్మాల్ క్యాప్ స్టాక్(Small Cap Stock) పడిపోయింది. ఈరోజు ఉదయం స్టాక్ రూ.50.70 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. స్పైస్‌జెట్ షేరు గత ఏడాది కాలంలో 35.58 శాతం నష్టపోగా, ఈ ఏడాది ప్రారంభం నుంచి 30.48 శాతం నష్టపోయింది. వారంలో ఈ షేరు 28.15 శాతం లాభపడింది. సంస్థ మొత్తం 9.21 లక్షల షేర్లు బీఎస్ఈలో రూ. 4.43 కోట్ల టర్నోవర్‌గా మారాయి. ఎయిర్‌లైన్ మార్కెట్ క్యాప్(Airline Market Cap) రూ.2,852.52 కోట్లకు పడిపోయింది.


స్పైస్‌జెట్‌లో మధ్యప్రాచ్యానికి చెందిన పెద్ద విమానయాన సంస్థ(A big Middle Eastern airline).. 24 శాతం వాటాతో పాటు బోర్డు సీటును ఎంచుకోవడానికి ఆసక్తిని కనబరిచిందని సమాచారం. ఒక పెద్ద భారతీయ వ్యాపార సముదాయం(A big Indian business conglomerate) సైతం ఎయిర్‌లైన్‌లో వాటా కోసం అజయ్ సింగ్‌(Ajay Singh)ను సంప్రదించినట్లు తెలుస్తోంది. 


Updated Date - 2022-08-04T20:08:05+05:30 IST