DGCA ఆదేశాలతో కుప్పకూలిన Spicejet షేర్లు.. రెండేళ్ల కనిష్టానికి స్టాక్

ABN , First Publish Date - 2022-07-28T17:16:15+05:30 IST

ఇండియన్ ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎనిమిది వారాల పాటు స్పైస్‌జెట్(Spicejet) కేవలం 50 శాతం

DGCA ఆదేశాలతో కుప్పకూలిన Spicejet షేర్లు.. రెండేళ్ల కనిష్టానికి స్టాక్

Spicejet : ఇండియన్ ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎనిమిది వారాల పాటు స్పైస్‌జెట్(Spicejet) కేవలం 50 శాతం విమాన కార్యకలాపాలను మాత్రమే నిర్దేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గురువారం ఇంట్రా-డేలో స్పైస్‌జెట్ షేర్లు రెండేళ్ల కనిష్టం రూ. 34.60కి చేరాయి. బీఎస్ఈ(BSE)లో కంపెనీ షేర్లు దారుణాతి దారుణంగా పడిపోయాయి. స్పైస్‌జెట్ షేర్లు 10 శాతం పడిపోయాయి. ఎయిర్‌లైన్ కంపెనీ స్టాక్ మార్చి 2020 నుంచి దాని కనిష్ట స్థాయిని కోట్ చేసింది. స్పైస్‌జెట్ నవంబర్ 24, 2021న తాకిన దాని 52 వారాల గరిష్ట స్థాయి రూ.87.25 నుంచి 60 శాతం కరెక్ట్ చేసుకుంది.


స్పైస్ జెట్ విమానాలపై డీజీసీఏ ఆంక్షలు విధించింది. ఇక మీదట 50 శాతం విమానాలను మాత్రమే నడపాలని స్పష్టం చేసింది. ఈ మేరకు స్పైస్ జెట్‌పై 8 వారాల పాటు ఆంక్షలు విధించింది. ఇటీవల కాలంలో తరచుగా స్పైస్ జెట్ విమానాల్లో సాంకేతిక సమస్యలు(Technical Problems) వస్తుండటంతో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. 24 రోజుల్లో స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం ఘటనలు 9 సార్లు చోటు చేసుకున్నాయి. 


సోమవారం VT-SZK రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన బోయింగ్ B737 మ్యాక్స్ విమానం సోమవారం మంగళూరు నుంచి దుబాయ్ వెళ్లింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత.. ఆ సర్వీస్ అక్కడి నుంచి మధురై(Madhurai)కి వెళ్లాల్సి ఉంది. కానీ విమానం ముందు చక్రాల్లో సమస్య కారణంగా గ్రౌండ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. దీని స్థానంలో మరో విమానాన్ని పంపించారు. 


జూన్ 19 నుంచి స్పైస్‌జెట్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలకు సంబంధించిన సంఘటనల నేపథ్యంలో డీజీసీఏ ఇటీవల షోకాజ్ నోటీసు జారీ చేసింది. సుర‌క్షిత‌మైన‌, స‌మ‌ర్థ‌వంత‌మైన‌, న‌మ్మ‌క‌మైన సేవ‌ల్ని క‌ల్పించ‌డంలో స్పైస్‌జెట్ సంస్థ విఫ‌ల‌మైన‌ట్లు పేర్కొంది. ఇటీవల చోటుచేసుకుంటున్న సాంకేతిక లోపాలపై సైతం డీజీసీఏ వివరణ కోరింది. 


Updated Date - 2022-07-28T17:16:15+05:30 IST