స్పైస్‌జెట్ విమానం హార్డ్ ల్యాండింగ్.. తప్పిన పెను ప్రమాదం

ABN , First Publish Date - 2020-12-06T03:15:30+05:30 IST

బెంగళూరు-గువాహటి మధ్య తిరిగే స్పైస్ జెట్ బోయింగ్ 737-800 జెట్ లైనర్ శుక్రవారం గువాహటి విమానాశ్రయంలో హార్డ్ ల్యాండింగ్ అయింది

స్పైస్‌జెట్ విమానం హార్డ్ ల్యాండింగ్.. తప్పిన పెను ప్రమాదం

న్యూఢిల్లీ: బెంగళూరు-గువాహటి మధ్య తిరిగే స్పైస్ జెట్ బోయింగ్ 737-800 జెట్ లైనర్ శుక్రవారం గువాహటి విమానాశ్రయంలో హార్డ్ ల్యాండింగ్ అయింది. ఈ సందర్భంగా రన్‌వేపై ఉన్న మూడు లైట్లు దెబ్బతిన్నాయి. సాధారణ ల్యాండింగ్ జోన్‌కు దాదాపు వెయ్యి అడుగుల ముందే ల్యాండ్ అవడంతో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు, కేబిన్ సిబ్బంది సహా 155 మంది ఉన్నారు. విమానం టైర్లలో ఒకదానిపై కట్ మార్క్స్ కనిపించాయి. ఘటన అనంతరం ప్రయాణికులను క్షేమంగా కిందికి దింపి విమానాన్ని పార్కింగ్ బేకు తరలించి పరిశీలించారు. ప్రమాదంపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. మేఘాలు తక్కువ ఎత్తులో ఉండడం వల్ల ఎత్తును పైలట్ సరిగా అంచనా వేయలేకపోయాడని, ప్రమాదానికి అదే కారణమని తెలుస్తోంది. ఈ కారణంగా నిర్దేశిత పాయింట్‌కు ముందే విమానం ల్యాండ్ అయిందని సమాచారం.


Updated Date - 2020-12-06T03:15:30+05:30 IST