విద్యపై వ్యయం భవిష్యత్తుకు పెట్టుబడి

ABN , First Publish Date - 2022-07-06T06:26:34+05:30 IST

విద్యపై వ్యయం భవిష్యత్తుకు పెట్టుబడి...ఓటు హక్కు లేకపోయినా విద్యార్థుల విద్య కోసం బడ్జెట్‌లో రూ.వేల కోట్లు కేటాయించి విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లాకు సంబంఽఽదించి పెందుర్తి ఉన్నత పాఠశాలలో మంగళవారం మూడో విడత జగనన్న విద్యాకానుక పథకానికి శ్రీకారం చుట్టారు.

విద్యపై వ్యయం భవిష్యత్తుకు పెట్టుబడి
విద్యాకానుక కిట్లను అందజేస్తున్న ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, పక్కన కలెక్టర్‌, మేయర్‌

ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌

పెందుర్తి ఉన్నత పాఠశాలలో విద్యాకానుక కిట్లు పంపిణీ 

హాజరైన కలెక్టర్‌, మేయర్‌, ఎమ్మెల్సీ 

పెందుర్తి, జూలై 5: విద్యపై వ్యయం భవిష్యత్తుకు పెట్టుబడి...ఓటు హక్కు లేకపోయినా విద్యార్థుల విద్య కోసం    బడ్జెట్‌లో రూ.వేల కోట్లు  కేటాయించి విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లాకు సంబంఽఽదించి పెందుర్తి ఉన్నత పాఠశాలలో మంగళవారం  మూడో విడత  జగనన్న విద్యాకానుక పథకానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌,  కలెక్టర్‌ మల్లికార్జున, మేయర్‌ హరి వెంకటకుమారి, ఎమ్మెల్సీ పాకలపాటి వర్మ, డీఈవో చంద్రకళ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ మాట్లాడుతూ రెండేళ్లలో ఎన్నికలు వస్తున్నాయని, ఓట్లకోసం ఆలోచన చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. కార్పొరేట్‌ స్కూల్స్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామన్నారు.  నియోజకవర్గంలో రూ.21 కోట్లతో పాఠశాలల అభివృద్ధి, అమ్మఒడి ద్వారా రూ.116 కోట్లు అందజేయడం జరిగిందన్నారు. కలెక్టర్‌ మల్లికార్జున మాట్లాడుతూ  ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఈ క్రమంలో జిల్లాలో 1,01370 మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక పథకం కింద రూ.16.9 కోట్లు వెచ్చించామన్నారు. నెలాఖరుకు జిల్లాలో జీవీకే కిట్ల పంపణి పూర్తవుతుందన్నారు. మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి మాట్లాడుతూ మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి వైసీపీ పెద్ద పీట వేసిందన్నారు, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ డైరెక్టర్‌ గోండు సీతారామ్‌, ఎమ్మెల్సీ పాకలపాటి వర్మ మాట్లాడారు. 

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ పంపిణీ చేశారు. అనంతరం పదోతరగతి ఫలితాల్లో టాపర్స్‌గా నిలిచిన బండారు శ్రావణి, సీహెచ్‌ వాణిలను సత్కరించారు.  వారికి లాప్‌ట్యాప్‌లు ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్‌ జిల్లా సమన్వయకర్త బి,శ్రీనివాసరావు,  కార్పొరేర్‌ ముమ్మన దేవుడు, ఎంపీపీ మదుపాడ నాగమణి, జడ్సీటీసీ సభ్యురాలు ఉప్పిలి దేవి, పీఏసీఎస్‌ చైర్మన్‌ గొర్లె రామునాయుడు, తహసీల్దార్‌ రామారావు, ఎంపీడీవో మంజులవాణి, ఎంఈవో సువర్ణ, ప్రధానోపాధ్యాయుడు బి.పైడంనాయుడు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-06T06:26:34+05:30 IST