లోక్‌ అదాలత్‌ ద్వారా సత్వర న్యాయం

ABN , First Publish Date - 2022-08-14T04:08:26+05:30 IST

లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులను రాజీ కుదుర్చుకొని సత్వర న్యాయం పొందవచ్చని జిల్లా ప్రఽధాన జడ్జి, న్యాయ సేవా సంస్థ చైర్మన్‌ సత్తయ్య అన్నారు. శనివారం జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో మాట్లాడారు. కక్షిదారులు కేసులను రాజీ కుదుర్చుకోవడం వల్ల విలువైన సమ యాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చన్నారు

లోక్‌ అదాలత్‌ ద్వారా సత్వర న్యాయం
మంచిర్యాలలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో మాట్లాడుతున్న జిల్లా జడ్జి సత్తయ్య

ఏసీసీ, ఆగస్టు 13: లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులను రాజీ కుదుర్చుకొని సత్వర న్యాయం పొందవచ్చని జిల్లా ప్రఽధాన జడ్జి, న్యాయ సేవా సంస్థ చైర్మన్‌ సత్తయ్య అన్నారు. శనివారం జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో  మాట్లాడారు. కక్షిదారులు కేసులను రాజీ కుదుర్చుకోవడం వల్ల విలువైన సమ యాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చన్నారు. జిల్లా జడ్జి సత్తయ్య అధ్యక్షతన అద నపు జడ్జి మైత్రేయి, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి ఉదయ్‌కుమార్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి వైష్ణవి, స్పెషల్‌ జ్యూడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ర్టేట్‌  సుమన్‌గ్రేవాల్‌, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిలు ఉపనీషద్వాని, అసదుల్లాష రీఫ్‌ ఆధ్వర్యంలో లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. మంచిర్యాల, బెల్లంపల్లి, లక్షె ట్టిపేట, చెన్నూర్‌ కోర్టుల్లో మొత్తం 1127 కేసుల్లో రాజీ కుదరగా  రూ.39 లక్షల సెటిల్‌మెంట్‌ అయింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లు, న్యాయవాదులు, న్యాయసేవా సంస్థ సిబ్బంది, బ్యాంకు, ఇన్సూరెన్స్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.  

లక్షెట్టిపేట రూరల్‌: ఇరు వర్గాలు రాజీపడి కేసులు పరిష్కరించేందుకే లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జూనియర్‌ సివిల్‌ జడ్జి లక్ష్మణాచారి పేర్కొన్నారు. క్షణి కావేశంలో తప్పు  చేసి కోర్టుల చుట్టూ తిరిగి సమయం వృథా చేసుకోవద్దని జడ్జి సూచించారు. హెడ్‌ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన కోర్టు కానిస్టేబుల్‌ రాజశే ఖర్‌ను సన్మానించారు. సెకండ్‌ క్లాస్‌ మెజిస్ర్టేట్‌ పాల్‌ సుధాకర్‌, బార్‌ అసోసియే షన్‌ అధ్యక్షుడు కిరణ్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు.  

చెన్నూరు: కోర్టు ఆవరణలో న్యాయమూర్తి సంపత్‌ ఆధ్వర్యంలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. బార్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ రాంబాబు, న్యాయవాదులు,  బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-08-14T04:08:26+05:30 IST