పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం: ఎస్పీ

ABN , First Publish Date - 2020-06-06T10:03:21+05:30 IST

జిల్లాలో పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీ బి.రాజ కుమారి ఆదేశించారు

పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం: ఎస్పీ

విజయనగరం క్రైం, జూన్‌ 5: జిల్లాలో పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని  ఎస్పీ బి.రాజ కుమారి ఆదేశించారు.  శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యా లయంలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఎఫ్‌ఎస్‌ఎల్‌, పోస్టుమార్టం, ఎంవీఐ రిపోర్టులు త్వరగా పొందాలన్నారు. అవసరమైతే ఆయా రిపోర్టులు పొందేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల్లో నింది తులను  అరెస్టు చేసి, అభియోగ పత్రాలు కోర్టుల్లో దాఖలు చేయాలని ఆదే శించారు.


కొద్ది రోజుల్లో విశాఖ రేంజ్‌ డీఐజీ పలు కేసులను సమీక్షించనున్న నేపథ్యంలో రికార్డులు సక్రమంగా పూర్తి చేయాలన్నారు.  సమావేశంలో డీఎస్పీ లు వీరాంజనీయరెడ్డి,  పాపారావు, సీఎం నాయుడు, ఎం.శ్రీనివాసరావు, బి.మోహనరావు, ఎల్‌.మోహనరావు, ఏఆర్‌ డీఎస్‌పీ శేషాద్రి, ట్రైనీ డీఎస్పీ సుభాష్‌, సీఐలు ఎర్రం నాయుడు, శ్రీహరిరాజు, రమేష్‌, వెంకట్రావు, శ్రీధర్‌, సుభద్రమ్మ, రాజుల నాయు డు రాంబాబు, దుర్గా ప్రసాదరావు, విద్యాసాగర్‌, కేశవరావు, ప్రసాదరావు, సింహాద్రినాయుడు, దశరఽథి, గోవిందరావు, రమేష్‌బాబు, శ్రీనివాసరావు తదితరు లు పాల్గొన్నారు.ఫ విజయనగరం (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు సహకరించిన  తగరపువలస దివీస్‌ లేబరేటరీ యాజమాన్యాన్ని ఎస్పీ సత్కరించారు. ఆ సంస్థ ప్రతినిధులు వై.కోటేశ్వరావు, సురేష్‌కుమార్‌, సీఎస్‌ఆర్‌ మేనేజర్లు పాల్గొన్నారు.  ఇదిలా ఉండగా జిల్లా మెడిక ల్‌ అసోసియేషన్‌ సభ్యులు 250 బొటాడిన్‌ గార్గిల్‌ ఓరల్‌ శానిటైజ్‌ బాటిళ్లను అందించగా వారిని ఎస్పీ అభినందించారు. 

Updated Date - 2020-06-06T10:03:21+05:30 IST