జియో ట్యాగింగ్‌ వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2021-02-27T05:19:36+05:30 IST

గృహనిర్మాణానికి సంబంధించి జియో ట్యాగింగ్‌ మ్యాపింగ్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో హౌసింగ్‌, మనబడి నాడు-నేడు పనులపై సమీక్షించారు.

జియో ట్యాగింగ్‌ వేగవంతం చేయండి


  జేసీ శ్రీనివాసులు

నందిగాం, ఫిబ్రవరి 26: గృహనిర్మాణానికి సంబంధించి జియో ట్యాగింగ్‌ మ్యాపింగ్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో హౌసింగ్‌, మనబడి నాడు-నేడు పనులపై సమీక్షించారు. మార్చి 6 నాటికి జియో ట్యాగింగ్‌, నాడు-నేడు పనులు మార్చి 5 నాటికి పూర్తి చేయాలని, పక్కా ప్రణాళికలతో ముందుకు సాగాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్‌, టెక్కలి హౌసింగ్‌ డీఈఈ కె.సుజాత, మండల ఇంజనీరింగ్‌ అధికారి పి.సంతోష్‌కుమార్‌, హౌసింగ్‌ ఏఈ కె.ఆనందకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


అలసత్వం వహిస్తే సహించేది లేదు

మందస: విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని జేసీ కె.శ్రీనివాసులు హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఎంపీ డీవో కార్యాలయం ఆవరణలో నాడు-నేడు పనులు, హౌసింగ్‌ స్కీమ్‌లకు సంబంధించి మండల అధికారులు, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లతో సమీక్ష నిర్వహించారు. మండలంలో 45 పాఠశాలల్లో  చేపడుతున్న ‘నాడు-నేడు’ పనుల వివరాలు తెలుసుకున్నారు. సకాలంలో వాటిని పూర్తి చేయక పోవడంపై ఐటీడీఏ ఇంజినీరింగ్‌ అధికారులు సీహెచ్‌ తవిటినాయుడు, వి.శ్రీని వాసులుపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఎంఈవో ఎస్‌. జొరాడును గోరుముద్ద పథకంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. మార్చి 10వతేదీ నాటికి జియో ట్యాగింగ్‌ పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీ ల్దార్‌ బి.పాపారావు, ఎంపీడీవో వి.తిరుమలరావు, హౌసింగ్‌ డీఈ లక్ష్మాజీ, ఏఈ రామ్మోహన్‌ ఉన్నారు. 


అధికారులతో జేసీ సమీక్ష

వజ్రపుకొత్తూరు : ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులు వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివా సులు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఈశ్వరమ్మ పాల్గొన్నారు.

 

Updated Date - 2021-02-27T05:19:36+05:30 IST