వేగం.. నిరంతరం

ABN , First Publish Date - 2021-12-18T06:13:25+05:30 IST

యాదాద్రి.. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దివ్య సన్నిధి. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విలసిల్లుతున్న ఈ క్షేత్రం అద్భు తం, అద్వితీయంగా రూపుదిద్దుకుంటోంది. కృష్ణరాతి శిలలు, పల్లవు లు, చోళుల కాలంనాటి శిల్పాల నిర్మాణాలతో చూసేందుకు రెండు కళ్లు చాలవన్నట్లుగా తీర్చిదిద్దుకుంటోంది.

వేగం.. నిరంతరం
మెరుగులు దిద్దుకుంటున్న యాదాద్రి ఆలయం

వడివడిగా యాదాద్రి విస్తరణ పనులు

రింగురోడ్డులో పచ్చదనం, గండిచెరువు సుందరీకరణ 

రాయిగిరి చెరువు వద్ద మినీ శిల్పారామం

గడువులోగా పూర్తి చేసేందుకు అధికారుల చర్యలు 


యాదాద్రి టౌన్‌ : యాదాద్రి.. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దివ్య సన్నిధి. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విలసిల్లుతున్న ఈ క్షేత్రం అద్భు తం, అద్వితీయంగా రూపుదిద్దుకుంటోంది. కృష్ణరాతి శిలలు, పల్లవు లు, చోళుల కాలంనాటి శిల్పాల నిర్మాణాలతో చూసేందుకు రెండు కళ్లు చాలవన్నట్లుగా తీర్చిదిద్దుకుంటోంది. విశాలమైన రహ దారులు, వాటి పక్కన పరుచుకున్న పచ్చదనం, సేదతీరేందుకు గార్డె న్లు ఎంతో ఉల్లాసం నింపుతున్నాయి. అంతర్గత నిర్మాణాలు పూర్తి కావొస్తుండ గా, మిగతా పనులు చకచకా సాగుతున్నాయి. ఆలయ ఉద్ఘాటన సమయం దగ్గర పడుతుండడంతో పనుల్లో వేగం.. నిరంతరాయంగా చేపడుతున్నారు. 



యాదాద్రి ఆలయ విస్తరణ పనులు వడివడిగా సాగుతున్నాయి. ఆలయ ఉద్ఘాటన సమయం దగ్గర పడుతుండడంతో వైటీడీఏ అధికారు లు విస్తరణ పనుల్లో వేగంపెంచారు. కొండపైన అష్టభుజి ప్రాకార మం డపంలో విద్యుద్దీకరణ పనులు, బస్‌బే, స్వాగత తోరణం, రక్షణగోడ, రహదారులు, కొండకింద గండి చెరువు సమీపంలో కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, అన్నప్రసాద భవనం, సత్యనారాయణస్వామి వ్రత మండపం తో పాటు కొండచుట్టూ గ్రీనరీ పనులను వేగిరపరిచారు. కొండకు ఈశాన్య దిశలో నాలుగు అంతస్థులలో సుమారు రూ.5.5కోట్ల అంచనా వ్యయంతో దర్శన క్యూకాంప్లెక్స్‌ నిర్మాణ పనులు తుదిదశకు చేరాయి. దర్శన క్యూకాంప్లెక్స్‌లో భక్తుల మౌలిక వసతి సదుపాయాల కల్పనతోపాటు క్యూకాంప్లెక్స్‌కు ఆధ్మాత్మిక హంగులను అమర్చే పనులను నిర్వహిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం కొండకు ఇరువైపులా నిర్మిస్తున్న రెం డు ఫ్లైఓవర్లు, మొదటి ఘాట్‌రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొండకింద మహా సుదర్శన యాగం జరిపే ప్రాంతాన్ని చదును చేసే పనులు అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. రింగురోడ్డు రహదారిలో గ్రీనరీ ఏర్పా ట్లు, గండి చెరువు సుందరీకరణ, అంతర్గత రహదారుల నిర్మాణ పనులపై ఆర్‌అండ్‌బీ అధికారులు దృష్టి సారించారు. ప్రధాన రహదారి సెం టర్‌లో పచ్చదనంతోపాటు విద్యుద్దీకరణ పనులు, రాయిగిరి చెరువు వద్ద మినీ శిల్పారామం నిర్మాణ పనుల్లో వేగంపెంచారు. అనుకున్న గడువులోగా కొండపైన విస్తరణ పనులను పూర్తి దిశలో అధికారులు కృషి చేస్తున్నట్లు, ఆలయ ఉద్ఘాటనకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు వైటీడీ ఏ అధికారులు పేర్కొంటున్నారు. 


చకచకా సత్యనారాయణస్వామి వ్రత మండప నిర్మాణం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా కొండకింద గండి చెరువు ప్రాంతంలో సత్యనారాయణస్వా మి వ్రత మండపం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పిల్లర్ల పనులు పూర్తికావడంతో శుక్రవారం సత్యనారాయణస్వామి వ్రత మండపంపై ఆర్‌సీసీ స్లాబ్‌ నిర్మాణ పనులు ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణలో కొనసాగాయి. సుమారు 2.57ఎకరాల విస్తీర్ణం లో రూ.17.38 కోట్ల అంచనా వ్యయంతో వ్రత మండపం నిర్మాణాని కి ప్లాన్లు రూపొందించిన వైటీడీఏ అధికారులు పనుల పర్యవేక్షణ ను ఆర్‌అండ్‌బీ అధికారులకు అప్పగించారు. సుమారు 44,670 చదరపు అడుగుల్లో సువిశాల విస్తీర్ణంలో రెండుహాళ్లను నిర్మిస్తున్నారు. కాగా వ్రత మండపం మొదటి హాల్‌ స్లాబ్‌ పనులు పూర్తయినట్లు, వ్రతమండపంలో భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన పనులు త్వరలోనే ఆరంభించనున్నట్లు, రెండోహాల్‌ స్లాబ్‌ నిర్మాణంతో పాటు మిగిలిన పనులు గడువులోగా పూర్తి చేయనున్నారు. 


శరవేగంగా ధ్వజస్తంభం, బలిపీఠం బంగారు తాపడం పనులు

యాదాద్రి ఆలయ విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆలయ ఉద్ఘాటన సమయం సమీపిస్తుండడంతో ప్రధానాలయంలో ధ్వజస్తంభం, బలిపీఠం బంగారు తాపడం పనులను అధికారులు ము మ్మరం చేశారు. ప్రధానాలయ గర్భగుడి ముఖద్వారం బంగారు తాపడం పనులు పూర్తిచేసిన అధికారులు ముఖమండపంలో ధ్వజస్తంభం, బలిపీఠంలకు రాగి రేకులు అమర్చే పనులు పూర్తిచేసి స్వర్ణతాపడం పనులు నిర్వహిస్తున్నారు. బలిపీఠం, ధ్వజస్తంబాలకు శ్రీవైష్ణవ పాంచరాత్రాగమాన్ని తెలియజేసే విధంగా శంకు, చక్ర, తిరునామాలు, లతలు, పద్మాలు, హంసలు తదితర ఆధ్యాత్మిక రూపులను తీర్చిదిద్దారు. అనుకున్న గడువులోగా ప్రధానాలయంలో అన్ని పనులు పూర్తిచేసి, త్వరలోనే స్వర్ణతాపడం పనులు పూర్తి చేయనున్నట్లు వైటీడీఏ అధికారులు పేర్కొంటున్నారు.


కొండపైన స్వాగత తోరణం స్లాబ్‌ పనులు 

యాదాద్రి ఆలయ విస్తరణ పనులను త్వరగా పూర్తి చేసే దిశలో వైటీడీఏ అధికారులు చర్యలు చేపట్టారు. శుక్రవారం కొండపైన భారీ స్వాగత తోరణంపై ఆర్‌సీసీ స్లాబ్‌ నిర్మాణం కోసం సెంట్రింగ్‌ పనులు ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణలో కొనసాగాయి. యాదాద్రికొండపై రెండు ఘాట్‌రోడ్డులను కలుపుతూ భారీ స్వాగత తోరణాన్ని నిర్మిస్తున్నా రు. సుమారు 40 అడుగుల ఎత్తు, 96 అడుగులు వెడల్పుతో భారీ స్వాగత తోరణాన్ని నిర్మిస్తున్నారు. రెండు ఘాట్‌రోడ్‌లను అనుసంధానంచేస్తూ ఈ భారీ స్వాగత తోరణం ఉంటుంది. ముందుగా ఒకవైపు స్లాబ్‌ నిర్మాణ పనులు పూర్తిచేసి ఆ దారిలో కొండపైకి వాహనాలు తరలిస్తూ మరో వైపు స్లాబ్‌ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు ఆర్‌అండ్‌ బీ అధికారులు చెబుతున్నారు. 


కొండకింద సర్వీసు రోడ్డు పనులు

యాదాద్రిక్షేత్రానికి భక్తులు చేరుకునే ప్రధాన రహదారికి ఇరువైపు లా ఉన్న సర్వీసు రోడ్డు పనులను అధికారులు వేగిర పరిచారు. కొండకింద వైకుంఠద్వారం ప్రాంతంలోని సర్వీసు రోడ్డు మెటల్‌ పనులు పూర్తిచేసిన అధికారులు శుక్రవారం బ్లాక్‌ టాప్‌ రోడ్డును పూర్తి చేశారు. ప్రధాన రహదారికి ఇరువైపులా నిర్మించిన సర్వీసు రోడ్డు డ్రైన్‌లైన్‌ల నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత మెటల్‌, బ్లాక్‌టాప్‌ రోడ్డు పనులు నిర్వహిస్తున్నట్టు, త్వరలోనే సర్వీసు రోడ్డు పనులు పూర్తి చేయనున్నట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు. 


శివాలయంలో ఇత్తడి గ్రిల్స్‌ ఏర్పాటు

యాదాద్రి ఆలయ విస్తరణలో బాగంగా కొండపైన అనుబంఽధ రామలింగేశ్వరస్వామి ప్రధానాయ మహామండపంలో ఇత్తడి గ్రిల్స్‌ ఏర్పాటు పనులు కళాకారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. శివాలయాన్ని సందర్శించిన భక్తులు స్ఫటిక లింగంతో పాటు గర్భాలయంలోని పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వీలుగా ఇత్తడి గ్రిల్స్‌ను ఏర్పాటు చేశారు. కాగా, శివాలయ మహామండపం చుట్టూ ఇత్తడి గ్రిల్స్‌ను ఏర్పాటు పూర్తయిందని వైటీడీఏ అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2021-12-18T06:13:25+05:30 IST