ఇంగ్లిష్‌ సబ్‌-టైటిల్స్‌తో రైతు నాయకుల ప్రసంగాలు

ABN , First Publish Date - 2021-02-25T07:07:13+05:30 IST

మూడు నెలలుగా తీవ్రస్థాయిలో ఉద్యమం జరుగుతున్నా.. దేశవ్యాప్తంగా మద్దతు రాకపోవడంపై రైతు నాయకులు ఆలోచనలో పడ్డారు.

ఇంగ్లిష్‌ సబ్‌-టైటిల్స్‌తో రైతు నాయకుల ప్రసంగాలు

మూడు నెలలుగా తీవ్రస్థాయిలో ఉద్యమం జరుగుతున్నా.. దేశవ్యాప్తంగా మద్దతు రాకపోవడంపై రైతు నాయకులు ఆలోచనలో పడ్డారు. తమ ప్రసంగాలు హిందీ, పంజాబీలోనే ఉంటుండటంతో.. హిందీయేతర రాష్ట్రాల ప్రజలకు అర్థం కావడంలేదని, అందువల్లే ఉద్యమం అక్కడికి చేరువ కాలేకపోతోందని రైతు నాయకులు భావిస్తున్నారు.


ఇందుకు పరిష్కారంగా రైతు నాయకుల ప్రసంగాలను  ఇంగ్లిషు సబ్‌-టైటిల్స్‌తో ఆన్‌లైన్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు. తొలి దశలో ఇంగ్లిషు సబ్‌-టైటిల్స్‌తో మాత్రమే విడుదల చేస్తున్నామని, ఆ తర్వాత దశలో అన్ని ప్రాంతీయ భాషల్లోనూ విడుదల చేస్తామని రైతు సంఘాల ఐటీ విభాగం తెలిపింది.


Updated Date - 2021-02-25T07:07:13+05:30 IST