Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరద బాధిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు

రాజంపేట, నవంబరు27 : రాజంపేట మండలంలోని వరద బాధిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సానె శేఖర్‌ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎప్పుడో తెచ్చిన ఆహారాన్ని బాధితులు తినడం వల్ల డయేరియా విరేచనాలు, విషజ్వరాలు వచ్చే అవకాశముందని ముందస్తు చర్యగా  నాలుగు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. అందులో 108 వాహనాలకు సంబంధించిన మూడు బృందాలు, 104 కు సంబఽందించిన ఏడు బృందాలు, ఏడుగురు ప్రత్యేక వైద్యులు, 40 మంది ఏఎన్‌ఎంలు, మొత్తం 60 పైబడి సిబ్బంది  ఉన్నారన్నారు. పులపత్తూరు, మందపల్లె, తొగూరుపేట, గుండ్లూరు ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక మందులు అందజేస్తున్నామన్నారు. పులపత్తూరుహరిజనవాడలో శనివారం ముగ్గురికి విరేచనలు, డయేరియా, జ్వరం రాగా వారిని వైద్యచికిత్సలు అందజేశామన్నారు. మేఘన అనే 9సంవత్సరాల బాలికకు డయేరియా రాగా రాజంపేటకు తరలించి చికిత్స అందించడం జరిగిందన్నారు. 

Advertisement
Advertisement