కెనడాలోని సాయి బాబా మందిరంలో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2020-03-30T20:19:57+05:30 IST

కెనడా కాల్గరీ శ్రీ అనఘా దత్త సొసైటీ( శ్రీ సాయిబాబా మందిరం)లో ఉగాది పర్వ దినం నుంచి ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ఆయన ప్రధాన నిర్వాహకులు లలిత, శైలేష్ తెలిపారు

కెనడాలోని సాయి బాబా మందిరంలో ప్రత్యేక పూజలు

టొరెంటో: కెనడా కాల్గరీ శ్రీ అనఘా దత్త సొసైటీ( శ్రీ సాయిబాబా మందిరం)లో ఉగాది పర్వ దినం నుంచి ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ఆయన ప్రధాన నిర్వాహకులు లలిత, శైలేష్ తెలిపారు. ఈ ప్రత్యేక పూజలు, యాగాలను ఏప్రిల్ 26 (వసంత పంచమి) వరకు జరిపించనున్నట్లు వారు వెల్లడించారు. కాగా.. మార్చి 28న ఆలయ ప్రధాన అర్చకుడు రాజకుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా సుదర్శన యాగానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరైనట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. వైరస్ నుంచి విముక్తి కోసం కూడా ప్రత్యేక పూజలు నిర్వహంచినట్లు చెప్పారు. వేద పారాయణం, నిత్య అగ్నిహోత్రం, పూజలు, యాగాలు చేయడం వల్ల ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నుంచి ప్రజలను భగవంతుడు కాపాడుతాడని వారు అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 26న లక్ష్మి నారాయణ కల్యాణంతో ప్రత్యేక పూజలు ముగుస్తాయని తెలిపారు. 


Updated Date - 2020-03-30T20:19:57+05:30 IST