కనకమహాలక్ష్మికి విశేష పూజలు

ABN , First Publish Date - 2022-08-20T06:29:39+05:30 IST

శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో నాలుగవ శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక శ్రావణ లక్ష్మి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు

కనకమహాలక్ష్మికి విశేష పూజలు
ప్రత్యేక అలంకరణలో కనకమహాలక్ష్మి

మహారాణిపేట, ఆగస్టు 19: శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో నాలుగవ శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక శ్రావణ లక్ష్మి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి కలువ పూలతో పూజలను నిర్వహించారు. ఈ నెల 26న ఉచిత సామూహిక శ్రావణ లక్ష్మి ప్రత్యేక పూజలను ఉదయం ఆరు గంటల నుంచి నిర్వహించనున్నట్టు  ఆలయ అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-08-20T06:29:39+05:30 IST