ప్రత్యేక ఓటరు జాబితా సవరణ

ABN , First Publish Date - 2020-08-13T07:38:36+05:30 IST

ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు భారత ఎన్నికల కమిషన్‌(ఈసీఐ) షెడ్యూల్‌ జారీ చేసింది

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ

  • దరఖాస్తు గడువు నవంబరు 15
  • జనవరి 15న ఓటరు తుది జాబితా
  • జనవరి1 నాటికి 18 ఏళ్లున్న వారు అర్హులు

హైదరాబాద్‌, ఆగ స్టు 12(ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు భారత ఎన్నికల కమిషన్‌(ఈసీఐ) షెడ్యూల్‌ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) డాక్టర్‌ శశాంక్‌గోయెల్‌ బుధవారం సంబంధిత షెడ్యూల్‌ను విడుదల చేశారు. 2021 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారంద రూ ఓటరుగా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. సవరణ అనంతరం 2021 జనవరి 15న ఓటరు తుది జాబితా ప్రకటించనున్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు, జాబితా సవరణకు నవంబరు 30వరకు గడువు విధించారు. 



10-08-2020-31-10-2020

పోలింగ్‌ కేంద్రాల పునర్‌వ్యవస్థీకరణ

01-11-2020-15-11-2020

దరఖాస్తు చేసుకునేందుకు గడువు

16-11-2020

ముసాయిదా జాబితా ప్రకటన

16-11-2020-15-12-2020

అభ్యంతరాల స్వీకరణకు గడువు

15-01-2021

ఓటరు తుది జాబితా ప్రకటన

Updated Date - 2020-08-13T07:38:36+05:30 IST