Abn logo
Jun 18 2021 @ 19:49PM

ఏపీలో 20న ప్రత్యేక టీకా డ్రైవ్

అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 20న ప్రత్యేక టీకా డ్రైవ్ చేపట్టనున్నట్లు అనిల్‌ సింఘాల్‌ తెలిపారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 124 మంది పిల్లలను గుర్తించామని ఆయన పేర్కొన్నారు. వారిలో 86 మందిపైన 10 లక్షల చొప్పున డిపాజిట్ చేస్తామని అనిల్‌ సింఘాల్‌ తెలిపారు. 4,582 గ్రామ, వార్డు సచివాలయాల్లో జీరో కేసులు నమోదయ్యాయని అనిల్‌ పేర్కొన్నారు. 267 కోట్లతో రాష్ట్రంలో  ఆక్సిజన్ ప్లాంట్లు, బెడ్లు, డీజీ సెట్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని సింఘాల్‌ తెలిపారు.