టీఏఆర్‌ఎల్‌పై ప్రత్యేక శిక్షణ

ABN , First Publish Date - 2022-06-26T04:59:35+05:30 IST

పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ఈనెల 27 నుంచి జూలై 1వతేదీ వరకు జరిగే టీచింగ్‌ ఎట్‌ రైట్‌ లెవల్‌ (టీఏఆర్‌ఎల్‌)పై విద్యాశాఖ రీసోర్స్‌ పర్సన్లకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ సీహెచ్‌. ఉషారాణి ఒక ప్రకటనలో తెలిపారు.

టీఏఆర్‌ఎల్‌పై ప్రత్యేక శిక్షణ

జిల్లా నుంచి ఐదుగురు ఉపాధ్యాయుల ఎంపిక 

నెల్లూరు (విద్య) జూన్‌ 25  : పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ఈనెల 27 నుంచి జూలై 1వతేదీ వరకు జరిగే టీచింగ్‌ ఎట్‌ రైట్‌ లెవల్‌ (టీఏఆర్‌ఎల్‌)పై విద్యాశాఖ రీసోర్స్‌ పర్సన్లకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ సీహెచ్‌. ఉషారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు విద్యార్థులో విద్యా ప్రమాణాలు పెంచడం, అన్ని విభాగాల్లో వారు రాణించడం, ఇతర కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంపొందించడం ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఉపాధ్యాయులు సల్మాసుల్తాన్‌ (కందుకూరు), పి.సుధాకర్‌( కలువాయి), సీహెచ్‌. వెంకటే శ్వర్లు, కె.రామకృష్ణ ( దగదర్తి), ఎ.సురేష్‌కుమార్‌( అనంత సాగరం)లను ఎంపిక చేసి శిక్షణకు పంపిస్తున్నామని తెలి పారు. శిక్షణ  అనంతరం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కొక్కరు వందమంది టీచర్లకు తిరిగి టీఏఆర్‌ఎల్‌పై శిక్షణ  ఇస్తారని పేర్కొన్నారు.

Updated Date - 2022-06-26T04:59:35+05:30 IST