ఎన్‌సీసీ కేడెట్లకు ప్రత్యేక శిక్షణ

ABN , First Publish Date - 2022-05-25T05:23:27+05:30 IST

10వ ఆంధ్ర నేవల్‌ యూనిట్‌ విస్తృతమైన నేపథ్యంలో కేడెట్లకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని గుంటూరు గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ ఆర్‌. జయకుమార్‌ తెలిపారు.

ఎన్‌సీసీ కేడెట్లకు ప్రత్యేక శిక్షణ
కేడెట్లతో కల్నల్‌ జయకుమార్‌

 కల్నల్‌ జయకుమార్‌ 

నెల్లూరు (విద్య) మే 24  : 10వ ఆంధ్ర నేవల్‌ యూనిట్‌ విస్తృతమైన నేపథ్యంలో కేడెట్లకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని గుంటూరు గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ ఆర్‌. జయకుమార్‌ తెలిపారు. నెల్లూరు ఎన్‌సీసీ కమాండింగ్‌ ఆఫీసర్‌ వినయ్‌ రామచంద్రన్‌ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్‌సీసీ కార్యాలయాన్ని ఆయన వార్షిక తనిఖీలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులో కేడెట్‌లు సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారని, ఇదే స్పూర్తితో మున్ముందూ కొనసాగించాలని అన్నారు. కేడెట్‌లందరూ ఉత్సాహంగా శిక్షణలో పాల్గొనడంతో పాటు ఎన్నో పతకాలు సొంతం చేసుకోవడం శుభ పరిణామమన్నారు. కలెక్టర్‌తో చర్చించి నెల్లూరు చెరువులో నౌకాయాన శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన పలువురు కేడెట్లకు పతకాలను, నగదు పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో వివిధ విద్యాసంస్థల ఎన్‌సీసీ  అధికారులు జి.సుధాకర్‌రెడ్డి, ఎస్‌కె.ఖాదర్‌భాషా, కె.జగన్నాఽథరావు, గుండాల నరేంద్రబాబు, సివి.నాగరాజు, సర్ధార్‌, మల్లిఖార్జునరెడ్డి, హరికృష్ణ, రమణ, సందీప్‌, న్యామతుల్లా, సూపరింటెండెంట్‌ సాగర్‌ ముకుంద, రామన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T05:23:27+05:30 IST