హుబ్లీ-నాందేడ్‌ మధ్య ప్రత్యేక రైలు

ABN , First Publish Date - 2022-08-13T06:14:17+05:30 IST

ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి ఈ నెలలో హుబ్లీ-నాందేడ్‌-హుబ్లీ మధ్య ఓ ప్రత్యేక వీక్లీ రైలు (నెం.07635)ను నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

హుబ్లీ-నాందేడ్‌ మధ్య ప్రత్యేక రైలు

గుంతకల్లు, ఆగస్టు12: ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి ఈ నెలలో హుబ్లీ-నాందేడ్‌-హుబ్లీ మధ్య ఓ ప్రత్యేక వీక్లీ రైలు (నెం.07635)ను నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. నాందేడ్‌-హుబ్లీ వీక్లీ ప్రత్యేక రైలు ఈ నెల 13, 20, 27 తేదీల్లో నడుస్తుందని, ఈ రైలు నాందేడ్‌లో పేర్కొన్న తేదీల్లో మధ్యాహ్నం2-10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు గుంతకల్లుకు చేరుకుని, మరుసటి 10 గంటలకు గమ్యస్థానమైన హుబ్లీకి చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణపు రైలు (నెం.07636) ఈనెల 14, 21, 28 తేదీల్లో ఉదయం 11 గంటలకు హుబ్లీలో బయలుదేరి గుంతకల్లుకు మధ్యాహ్నం 3-55 గంటలకు చేరుకుని, గమ్యస్థానమైన నాందేడ్‌కు మరుసటి రోజు ఉదయం 6-50 గంటలకు చేరుకుంటుందని వివరించారు. ఈ రైలు పూర్ణా, పర్బని, పర్లి వైజ్‌నాథ్‌, లాతూరు, ఉద్గిర్‌, బీదర్‌, జహీరాబాద్‌, వికారాబాద్‌, తాండూరు, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, బళ్లారి, తోరణగల్లు, హోస్పేట, మునిరాబాద్‌, కొప్పల్‌, గదగ్‌ స్టేషన్ల మీదుగా వెళ్తుందని తెలియజేశారు. 


రైళ్ల రద్దు, దారి మళ్లింపు: గుంతకల్లు-ధర్మవరం సెక్షనలోని తాటిచెర్ల-జంగాలపల్లి రైల్వే స్టేషన్ల మధ్యన జరుగుతున్న నాన-ఇంటర్లాకింగ్‌ పనుల కారణంగా పలు రైళ్లను రద్దుపరచి, కొన్నింటిని రైల్వే అధికారులు దారిమళ్లించారు. గుంతకల్లు-హిందూపురం డెము ప్యాసింజరు (07695) రైలును 19వ తేదీ వరకూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (07694)ను 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ రద్దు చేశారు. 


రైళ్ల పాక్షిక రద్దు: తిరుపతి-గుంతకల్లు-తిరుపతి ప్యాసింజరు (07656/55) రైలును ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకూ గుంతకల్లు-ధర్మవరం సెక్షనలో పాక్షికంగా రద్దుపరచి కేవలం తిరుపతి-ధర్మవరం సెక్షనలో మాత్రమే నడపనున్నట్లు వివరించారు. అలాగే విజయవాడ-ధర్మవరం రైలు (17215)ను ఈ నెల 12 నుంచి 18 వరకూ, తిరుగు ప్రయాణపు రైలు (17216)ను 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ గుత్తి-ధర్మవరం సెక్షనలో పాక్షికంగా రద్దుచేసి, గుత్తి-విజయవాడ సెక్షనలో మాత్రమే నడపనున్నట్లు వెల్లడించారు. 

దారిమళ్లిన రైళ్లు: తిరుపతి-కదిరిదేవరపల్లి ప్యాసింజరు (07589) రైలును, తిరుగు ప్రయాణపు రైలు (17590)ను ఈనెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ కదిరి, ధర్మవరం, అనంతపురం మీదుగా కాకుండా రేణిగుంట, గుత్తి, గుంతకల్లు రూటులో దారిమళ్లించి నడపనున్నట్లు చెప్పారు. ముంబై-నాగర్‌కోయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ (16339) రైలును, తిరుగు ప్రయాణపు రైలు (16340)ను 16, 17 తేదీల్లో గుంతకల్లు, గుత్తి, రేణిగుంట, తిరుపతి, పాకాల స్టేషన్ల మీదుగా మళ్లించనున్నట్లు పేర్కొన్నారు. అమరావతి-తిరుపతి (12766) ఎక్స్‌ప్రె్‌సను 15వ తేదీన, దీని పెయిర్‌ ట్రెయిన (12765)ను 16వ తేదీన, సికింద్రాబాద్‌-తిరుపతి (12770) రైలును 16న, సికింద్రాబాద్‌-తిరుపతి (12732)ను 17 గుత్తి, రేణిగుంట సెక్షన్ల మీదుగా దారి మళ్లించారు. 

Updated Date - 2022-08-13T06:14:17+05:30 IST