Advertisement
Advertisement
Abn logo
Advertisement

తుఫాన్‌ సాయానికి ప్రత్యేక బృందాలు

ఆర్డీవో సీతారామారావు


అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 3: జవాద్‌ తుఫాన్‌ కారణంగా ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు ప్రతీ మండలానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఆర్డీవో జె.సీతారామారావు చెప్పారు. శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు చెరువుల పరిస్థితులను తెలుసుకొని సమాచారం ఇవ్వాలని ఇరిగేషన్‌ అధికారులకు సూచించామన్నారు. సముద్ర తీర ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లొద్దని కోరారు. ప్రతి గ్రామంలోనూ సెక్రటరీ స్థాయి అధికారిని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌రూములు ఏర్పాటు చేశామన్నారు. సెలవుల్లో ఉన్న అధికారులు విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నామని ఆర్డీవో చెప్పారు. కాగా, ఆర్టీసీ పరంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నామని డిపో మేనేజర్‌ ఎ.గిరిధరకుమార్‌ తెలిపారు. 

Advertisement
Advertisement