Haryana ఎమ్మెల్యేలకు బెదిరింపులపై విచారణకు ప్రత్యేక task force

ABN , First Publish Date - 2022-07-11T17:43:12+05:30 IST

ఐదుగురు హర్యానా ఎమ్మెల్యేలకు వచ్చిన బెదిరింపు కాల్‌లపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ దర్యాప్తు చేస్తుందని హర్యానా హోంశాఖ మంత్రి అనిల్ విజ్...

Haryana ఎమ్మెల్యేలకు బెదిరింపులపై విచారణకు ప్రత్యేక task force

హర్యానా హోంశాఖ మంత్రి అనిల్ విజ్ వెల్లడి

చండీఘడ్(హర్యానా): ఐదుగురు హర్యానా ఎమ్మెల్యేలకు వచ్చిన బెదిరింపు కాల్‌లపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ దర్యాప్తు చేస్తుందని హర్యానా హోంశాఖ మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చిన ఐదుగురు హర్యానా ఎమ్మెల్యేలకు బెదిరింపులు వచ్చాయని చెప్పిన నేపథ్యంలో తాను దర్యాప్తునకు ఆదేశించామని మంత్రి చెప్పారు. ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఒకరు బీజేపీకి చెందిన వారు కాగా, మిగిలిన నలుగురు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు చెందిన వారు. చాలా ఫోన్ కాల్‌లు గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చాయి.ఈ కేసును తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానని, ఏదైనా పరిణామాల గురించి ప్రతిరోజూ అప్‌డేట్ చేస్తున్నానని మంత్రి అనిల్ విజ్ చెప్పారు. 


సోనిపట్‌లో విలేకరుల సమావేశంలో విజ్ మీడియాతో మాట్లాడారు. దర్యాప్తు చివరి దశలో ఉందని, అయితే కేసు యొక్క సున్నితత్వం కారణంగా వివరాలను బహిరంగపరచలేమని చెప్పారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, శాసనసభ్యులకు ఈ బెదిరింపులన్నీ విదేశాల నుంచి వస్తున్నాయని విజ్ అన్నారు.శుక్రవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే కులదీప్ వత్స్ ఇంట్లోకి అక్రమార్కులు ప్రవేశించిన అంశంపై అనిల్ విజ్ మాట్లాడారు. శుక్రవారం ఐదుగురు వ్యక్తులు బద్లీలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ పటౌడీ ఇంట్లో లేని సమయంలో చొరబడి అతని వంట మనిషిని కొట్టారని మంత్రి చెప్పారు. 


కుల్దీప్ ను సిద్ధూ మూస్ వాలా లాగా హతమారుస్తానని బెదిరించారని మంత్రి వివరించారు.తాను కుల్దీప్ ను కలిశానని, ఈ కేసులో సంబంధిత అధికారులతో మాట్లాడానని, ఈ కేసులో నిందితులను త్వరలో పట్టుకుంటామని విజ్ పేర్కొన్నారు.


Updated Date - 2022-07-11T17:43:12+05:30 IST