సారా రవాణాపై ప్రత్యేక నిఘా

ABN , First Publish Date - 2020-12-03T05:12:03+05:30 IST

సరిహద్దు ప్రాంతాల్లో సారా రవాణాపై ప్రత్యేక నిఘాపెట్టాలని ఎస్పీ అమిత్‌బర్దర్‌ ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌ఈబీ అధికారులతో ఎస్పీ సమీక్షించారు.

సారా రవాణాపై ప్రత్యేక నిఘా
మాట్లాడుతున్న ఎస్పీ అమిత్‌బర్దర్‌

  ఎస్‌ఈబీ, పోలీసు శాఖ సమన్వయంతో పనిచేయాలి: ఎస్పీ 

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, డిసెంబరు 2 : జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో సారా రవాణాపై ప్రత్యేక నిఘాపెట్టాలని ఎస్పీ అమిత్‌బర్దర్‌ ఆదేశించారు. బుధవారం  జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌ఈబీ అధికారులతో ఎస్పీ సమీక్షించారు. సారా తయారీ, మద్యం, ఇసుక, గంజాయి అక్రమ రవాణాకు అవకాశం ఇవ్వొద్దన్నారు. జిల్లాలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, పోలీసుశాఖ సమన్వయంతో పనిచేసి సరిహద్దుల్లో నిఘా పటిష్టం చేయాలని ఆదేశించారు.  ఒడిశా నుంచి తరలిస్తున్న మద్యం రవాణాను అరి కట్టేందుకు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు విస్తృతంగా చేయాలన్నారు.బోర్డర్‌ చెక్‌పోస్టులు, మొబైల్‌ టాస్క్‌ఫోర్స్‌ పనితీరుపై ఆరాతీశారు. సారా విక్రయిస్తున్న కుటుంబాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో రైడ్స్‌, కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించాలని ఆదేశిం చారు. సారా తయారీకి అవసరమైన ముడిపదార్థాల విక్రయించకుండా  ప్రజల్లోనూ చైతన్యం తీసుకురావాలని  తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ కమిషనర్‌ సుఖేష్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ భార్గవరావు పాల్గొన్నారు. 


సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండండి 

ఇచ్ఛాపురం: సైబర్‌ నేరాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఐ వినోద్‌బాబు తెలిపారు. బుధ వారం ఇచ్ఛాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడు తూ ఆన్‌లైన్‌ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులు  నియమించాలని బ్యాంక్‌ అధికారులకు సూచించినట్లు తెలిపారు. చైన్‌స్నాచింగ్‌లు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. 


  


Updated Date - 2020-12-03T05:12:03+05:30 IST