ఫ్యాక్షనపై ప్రత్యేక నిఘా: ఎస్పీ

ABN , First Publish Date - 2021-09-29T05:42:00+05:30 IST

జిల్లాలో ఫ్యాక్షన కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఫక్కీరప్ప సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించా రు.

ఫ్యాక్షనపై ప్రత్యేక నిఘా: ఎస్పీ
యల్లనూరు పోలీస్‌స్టేషనలో రికార్డులు పరిశీలిస్తున్న ఎస్పీ ఫక్కీరప్ప

పుట్లూరు/యల్లనూరు/తాడిపత్రి టౌన, సెప్టెంబరు 28: జిల్లాలో ఫ్యాక్షన కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఫక్కీరప్ప సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించా రు. మంగళవారం ఆయన పుట్లూరు పోలీస్‌స్టేషనను ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈసంద ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాల న్నారు. మద్యం అక్రమ రవాణా నియంత్రణకు దాడులు కొనసాగిస్తున్నామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ పంచాయతీ నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొనేలా సూచించామన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 8.95 లక్షల మంది దిశ యాప్‌ను డౌనలోడ్‌ చేసుకున్నారన్నారు. ఫ్యాక్షనిస్టులు, వారి అనుచరుల కదలికలపై నిఘా ఉంచామన్నారు. రౌ డీషీటర్లకు ప్రతి ఆదివారం కౌన్సెలింగ్‌ ఇస్తున్నామన్నారు. కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.


అనంతరం ఆయన యల్లనూరు పోలీస్‌స్టేషనను తనిఖీచేశారు. మండ లంలో భూసమస్యలు అధికంగా ఉన్నాయని, వీటితోనే శాంతిభద్రతల సమస్య తలెత్తుతు న్నదని ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యపై కలెక్టర్‌తో చర్చిస్తానని ఎస్పీ తెలిపారు. స్టేషనకు సిబ్బందిని నియమిస్తామన్నారు. అదేవిధంగా తాడిపత్రి మండలం చిన్నపొలమ డ సమీపంలో ఏర్పాటు చేయనున్న డీఎస్పీ కార్యాలయం కోసం సర్వేనెంబర్‌ 371-బీలోని ప్రభుత్వ స్థలాన్ని బుధవారం ఎస్పీ పరిశీలించారు. తహసీల్దార్‌ నాగభూషణంను వి వరా లు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఎస్పీ చైతన్య, సీఐలు కృష్ణారెడ్డి, చిన్నపెదయ్య, ఎస్‌ఐలు ధరణీబాబు, ఖాజాహుస్సేన, గురుప్రసాద్‌రెడ్డి, జగదీష్‌ ఉన్నారు.


Updated Date - 2021-09-29T05:42:00+05:30 IST