Advertisement
Advertisement
Abn logo
Advertisement

మత్తు పదార్థాల నేరస్థులపై ప్రత్యేక నిఘా


 ఎస్పీలు, కమిషనర్లతో  వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి

సిద్దిపేట  క్రైం/ మెదక్‌ అర్బన్‌, నవంబరు 30: మత్తు పదార్ధాల నేరస్థులపై ప్రత్యేక నిఘా ఉంచాలని రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో పెండింగ్‌ కేసులపై, వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్రంలో మత్తు పదార్ధాల విక్రయాలను ఆరికట్టాలన్నారు. నేరస్థులపై దృష్టి సారించి వారి పూర్తి వివరాలను సేకరించాలన్నారు. ప్రతీ పోలీసు అధికారికి నేరస్థుల వివరాలు తెలిసి ఉండాలన్నారు. బ్ల్యూకొల్ట్స్‌, పాట్రో మొబైల్‌ అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. నేర విచారణ అధికారి కేసుల్లో శిక్షలు పడే విధంగా ఇన్వెస్టిగేషన్‌ చేయాలన్నారు. కోర్టులలో ట్రయల్‌ నడిచే సమయంలో సాక్షులను మోటివేట్‌ చేయాలని సూచించారు. నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి, నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్ధాయిల అధికారులు పనిచేయాలని చెప్పారు. పోక్సో కింద మహిళలకు సంబంధించిన కేసుల్లో శిక్షల శాతం పెంచాలని, అధికారులకు సిబ్బందికి తరచుగా శిక్షణ తరగతులు నిర్వహించి వారి యొక్క పనితనాన్ని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.   హెచ్‌ఆర్‌ఎంఎ్‌స యాప్‌లో పోలీస్‌ అధికారులకు, సిబ్బందికి సంబంధించిన సర్వే రికార్డ్స్‌ ప్రతిరోజూ  డిజిటలైజేషన్‌  చేయాలని సూచించారు. డ్రగ్‌  అఫెండర్స్‌ ప్రొఫైలింగ్‌ అనాలసిస్‌ మానిటరింగ్‌ సిస్టం యా్‌పను డీజీపీ చేతుల మీదుగా మంగళవారం లాంచ్‌ చేశారు. సైబర్‌ నేరాల నియంత్రణ గురించి గ్రామాల్లో, పట్టణాల్లో పోలీస్‌ కళాబృందం, పోలీస్‌ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మెదక్‌ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గ్రేవ్‌, నాన్‌గ్రేవ్‌ కేసులు ప్రతీ వారం పెండింగ్‌ ఉన్న కేసులపై రివ్యూ చేస్తున్నామని  మెదక్‌ ఎస్పీ చందనాదీప్తి డీజీపీకి వివరించారు. పెండింగ్‌ కేసులు త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు ఎస్పీ(అడ్మిన్‌) బాలస్వామి, ఏఎస్పీ కృష్ణమూర్తి, మెదక్‌, తూప్రాన్‌ డీఎస్పీలు సైదులు, కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సిద్దిపేట జిల్లా నుంచి అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ శ్రీనివాసులు, అడిషనల్‌ డీసీపీలు రామేశ్వర్‌, మహేందర్‌, నారాయణ, గజ్వేల్‌ ఏసీపీ రమేష్‌, సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ క్రాంతి కుమార్‌, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ యాలాద్రి, కమ్యూనికేషన్‌ సీఐ జగన్‌, సీసీఆర్‌బీ హెడ్‌ కానిస్టేబుల్‌ మిస్బాఉద్దీన్‌,  ఐటీ కోర్‌ సిబ్బంది  పాల్గొన్నారు. 

Advertisement
Advertisement