ఆపత్కాలంలో అండగా నిలిచే ధీమా.. ఎన్నెన్నో ప్రయోగాలు చేసిన ABN

ABN , First Publish Date - 2021-10-15T18:47:11+05:30 IST

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. ఈ పేరే ఓ భరోసా. ఈ ఛానెలే ఓ ధీమా. ఈ లోగోనే గుండెనిబ్బరానికి సంకేతం. తెలుగువాళ్ల అసలు సిసలైన సమాచార దర్పణం. ఆపదలో ఉన్నవాళ్లకు అండగా నిలబడే ఆయుధం. సమస్యలు ఎదురైతే.....

ఆపత్కాలంలో అండగా నిలిచే ధీమా.. ఎన్నెన్నో ప్రయోగాలు చేసిన ABN

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. ఈ పేరే ఓ భరోసా. ఈ ఛానెలే ఓ ధీమా. ఈ లోగోనే గుండెనిబ్బరానికి సంకేతం. తెలుగువాళ్ల అసలు సిసలైన సమాచార దర్పణం. ఆపదలో ఉన్నవాళ్లకు అండగా నిలబడే ఆయుధం. సమస్యలు ఎదురైతే పరిష్కారానికి మార్గం చూపే చుక్కాని. అలాంటి దమ్మున్న ఛానెల్‌ పుష్కర ప్రస్థానంలో తనదైన శైలిపై స్పెషల్‌ ఫోకస్‌.


అక్షరం వీక్షణంగా మారింది. సమస్యల ముద్రణ నుంచి ప్రజల గొంతుక అయ్యింది. వార్తలను శ్వాసిస్తూ వాస్తవాలకు ప్రతిబింబంగా రూపుదిద్దుకుంది. ఆయుధమైన అక్షరం.. వియ్‌ రిపోర్ట్‌.. యూ డిసైడ్‌ అంటూ ప్రేక్షకులకే ఛాయిస్ ఇచ్చింది. అలా.. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఆవిర్భవించి పన్నెండేళ్లు గడిచాయి. 


సరిగ్గా పుష్కరం క్రితం పురుడు పోసుకున్న ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి.. ముక్కుసూటి వార్తలతో ప్రజలకు దగ్గరయ్యింది. వాస్తవాల ప్రసారంతో జనం గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ప్రతీ ఆటుపోటునూ గుండెధైర్యంతో ఎదుర్కొంది. నిబ్బరంగా రొమ్ము విరుచుకొని నిలబడుతోంది.


ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. సమాచార సామ్రాజ్యంలో ఈ పేరే ఓ ధైర్యం. ఈ పేరే ఓ భరోసా. నిజమైన, నిఖార్సయిన సమాచార వ్యాప్తికి దివిటీ. వేగవంతమైన వార్తల ప్రసారానికి కేరాఫ్‌ అడ్రస్‌. ఉన్నతమైన ఆశయాలే లక్ష్యంగా, సమున్నతమైన సమాచార స్రవంతే ధ్యేయంగా దూసుకెళ్తోంది ఏబీఎన్‌. తన ప్రయాణంలో అనేక విజయాలను సాధించింది.


ఆపత్కాలంలో ప్రజలకు, ముఖ్యంగా బాధితులకు అండగా నిలిచే ధీమా అయ్యింది ఏబీఎన్‌. అవసరార్థులకు ఆసరానిచ్చే కథనాలకు చిరునామాగా నిలుస్తోంది. వాస్తవమైన వార్తల ఖజానాగా భాసిల్లుతోంది. విషయం ఏదైనా, సందర్భం ఏదైనా, ప్రయోజనం ఏదైనా అన్నికోణాలనూ ఆవిష్కరించే జర్నలిజానికి నిలువుటద్దంగా నిలుస్తోంది ఏబీఎన్‌. ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అన్నిరకాల వార్తలకూ అసలైన వేదికగా ఏబీఎన్‌ తన విశ్వసనీయతను కాపాడుకుంటోంది. 


ఈ పన్నెండేళ్ల ప్రస్థానంలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎన్నెన్నో ప్రయోగాలు చేసింది. సమకాలీన యుగంలో ప్రజలకు ఏది అవసరమో అధ్యయనాలు కూడా చేసింది. పలు మైలురాళ్లను అధిగమించింది. సమాచార యజ్ఞంలో తనదైన ప్రత్యేకతను నిత్యం చూపెడుతోంది. ప్రజలకే నిర్ణయాధికారం వదిలేస్తోంది.


సప్తగిరి గోపగోని, చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి

Updated Date - 2021-10-15T18:47:11+05:30 IST