‘స్మార్ట్‌’ తాళాలివి!

ABN , First Publish Date - 2022-07-31T16:46:13+05:30 IST

ఇంటికి తాళం వేసి అడుగు బయట పెట్టాలంటే భయపడే రోజులు పోయాయి. అసలు ఇంటికి తాళం వేశామనే గుర్తించలేరెవరు. పాతరోజుల తాళం కప్పల స్థానంలో ‘స్మార్ట్‌’గా ఇంట్లోకి వచ్చిన కొత్తతరం తాళాలు

‘స్మార్ట్‌’ తాళాలివి!

ఇంటికి తాళం వేసి అడుగు బయట పెట్టాలంటే భయపడే రోజులు పోయాయి. అసలు ఇంటికి తాళం వేశామనే గుర్తించలేరెవరు. పాతరోజుల తాళం కప్పల స్థానంలో ‘స్మార్ట్‌’గా ఇంట్లోకి వచ్చిన కొత్తతరం తాళాలు భద్రతతో పాటు భరోసా కూడా ఇస్తున్నాయి. ఇప్పుడిక ఎక్కడినుంచైనా, ఎలాంటి బెంగ లేకుండా... ఇంటికి వేసిన తాళాన్ని ‘స్మార్ట్‌’గా ఆపరేట్‌ చేయొచ్చు.


సుభాష్‌.... ఆలస్యం అవుతోందని హడావిడిగా ఆఫీసుకు బయలుదేరాడు. ఆఫీసుకు చేరుకున్నాక ఇంటికి తాళం వేశానా? లేదా? అనే సందేహం వచ్చింది. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. దివ్య... తెలిసిన వాళ్ల ఫంక్షన్‌కు వెళ్లింది. పిల్లలు స్కూల్‌ నుంచి వచ్చే లోగా తిరిగి ఇంటికి చేరుకోవచ్చని అనుకుంది. కానీ ఆలస్యమయింది. పిల్లలేమో ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆమె వచ్చే వరకు బయటే కూర్చున్నారు. ఇలాంటి ఇబ్బందులు ఏదో ఒక సమయంలో అందరికీ ఎదురయ్యేవే. కానీ ఇంటికి ‘స్మార్ట్‌’లాక్‌ బిగించుకుంటే ఆ ఇబ్బందులు ఉండవు. ఇంటికి తాళం వేశానా లేదా అని సుభాష్‌ తన స్మార్ట్‌ఫోన్‌లోనే చెక్‌ చేసుకోవచ్చు. దివ్య ఫంక్షన్‌లో ఉన్నా పిల్లలు రాగానే స్మార్ట్‌ఫోన్‌తో డోర్‌లాక్‌ ఓపెన్‌ చేయవచ్చు. అంతేకాదు... సరికొత్త ‘స్మార్ట్‌’ తాళాల వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటంటే...


  • ఇంటికి ఒకరోజు తాళం వేసి ఉందంటే చాలు... దొంగల దృష్టి పడిపోతుంది. పండుగకు మూడు రోజులు ఊరెళితే మనసంతా ఇంటిపైనే ఉంటుంది. అయితే ఇంటికి ‘స్మార్ట్‌’ లాక్‌ అమర్చుకుంటే ఈ భయాలకు చెక్‌ పెట్టొచ్చు. ఇంటికి కావలసిన భద్రత స్మార్ట్‌ తాళాలతో లభిస్తుంది. 
  • స్మార్ట్‌లాక్‌ను బిగించుకున్నాక ఆ తాళానికి సంబంధించిన యాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే రిమోట్‌గా మానిటర్‌ చేయవచ్చు. స్మార్ట్‌లాక్‌ను నియంత్రించుకోవచ్చు. అవసరమైతే కొత్త పాస్‌కోడ్స్‌ పెట్టుకోవచ్చు. 
  • బయటకు వెళుతూ ‘మా వాళ్లు వస్తే కాస్త తాళం చెవి ఇవ్వండి’ అని పక్కింటి వాళ్లను రిక్వెస్ట్‌ చేయాల్సిన అవసరం ఉండదు. కుటుంబ సభ్యులందరూ పాస్‌కోడ్‌తో, ఫింగర్‌ప్రింట్‌తో లేదా స్మార్ట్‌ఫోన్‌తో తాళం ఓపెన్‌ చేసుకోవచ్చు. మీరు ఊర్లో ఉండగా అనుకోకుండా మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా మీరు ఉన్నచోటు నుంచే డోర్‌ ఓపెన్‌ చేసి వాళ్లను ఇంట్లోకి వెళ్లమనవచ్చు.
  • తాళం చెవి పోవడం, తాళం పగలగొట్టాల్సి రావడం, డోర్‌ గొళ్లెం విరిగిపోవడం వంటి ఇబ్బందులు ఎదురుకావు. తాళం చెవి పోతే మరో తాళం చెవి తయారుచేయించు కోవాల్సిన పరిస్థితులు ఎదురు కావు. 
  • అపరిచితులు ఎవరైనా తాళం తీయాలని ప్రయత్నించినపుడు మీకు అలర్ట్‌ మెసేజ్‌ వస్తుంది. దాంతో చుట్టు పక్కల వాళ్లను, పోలీసులను అలర్ట్‌ చేయవచ్చు. 
  • మీరు కొత్తగా కొన్న ఫ్లాట్‌కి ‘స్మార్ట్‌’లాక్‌ బిగించుకున్నట్లయితే అద్దెకు వచ్చే వారికి చూపించడానికి, ప్రాపర్టీ మేనేజర్స్‌కు చూపించడానికి మీరు అక్కడే ఉండాల్సిన పనిలేదు. స్మార్ట్‌గా మీరు ఫోన్‌తో లాక్‌ ఓపెన్‌ చేస్తే వాళ్లు ఫ్లాట్‌ను చూసుకుంటారు.
  • స్మార్ట్‌ తాళాల వల్ల ఇంటికి పూర్తి భద్రత లభించడమే కాకుండా నియంత్రణ కూడా వస్తుంది. ఇంట్లోకి ఎవరెవరు వచ్చి వెళ్లారో డేటా హిస్టరీని చూడొచ్చు. 
  • 5జి నెట్‌వర్క్‌, బ్లూ టూత్‌, జడ్‌వేవ్‌, జిగ్‌బీ... వంటి మోడ్రన్‌ కనెక్టింగ్‌ టెక్నాలజీల ఆధారంగా స్మార్ట్‌లాక్స్‌ పనిచేస్తాయి. ఇంట్లో వైఫై కనెక్టివిటీ ఉంటే స్మార్ట్‌ఫోన్‌ సహాయంతో ఆపరేట్‌ చేసుకోవచ్చు. 
  • స్మార్ట్‌లాక్స్‌ను హ్యాక్‌ చేయడం అంత సులువు కాదు. పాస్‌కోడ్‌ను గెస్‌ చేయడం కూడా సాధ్యం కాదు.రకరకాల డిజైన్లలో, రకరకాల మోడల్స్‌లో స్మార్ట్‌ లాక్స్‌ లభిస్తున్నాయి. 
  • మీ బడ్జెట్‌, స్పెసిఫికేషన్స్‌ను దృష్టిలో పెట్టుకుని లాక్‌ని ఎంచుకోవాలి. సాధారణ డోర్స్‌కి సైతం వీటిని సులువుగా బిగించుకోవచ్చు. 



ఆగస్ట్‌ స్మార్ట్‌లాక్‌(August smart lock)

నాణ్యమైన స్మార్ట్‌లాక్‌ ఇది. పదినిమిషాల్లో బిగించుకోవచ్చు. స్నేహితులు, బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వారికి ఇంట్లోకి సులువుగా యాక్సెస్‌ ఇవ్వొచ్చు. తాళం చెవి కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఈ స్మార్ట్‌ వైఫై లాక్‌ పూర్తి రిమోట్‌గా పనిచేస్తుంది. ఆటోలాక్‌, డోర్‌ సెన్స్‌ ఫీచర్ల ఆధారంగా తలుపు మూసిన వెంటనే ఆటోమెటిక్‌గా లాక్‌ అవుతుంది. 



యూఫీ(Oufy smart lock)

ఈ స్మార్ట్‌లాక్‌ చాలా వేగంగా పనిచేస్తుంది. 0.3 సెకన్లలో మీ ఫింగర్‌ప్రింట్‌ను గుర్తించి ఒక సెకనులో డోర్‌ ఓపెన్‌ చేస్తుంది. నాలుగు రకాలుగా ఈ లాక్‌ను అన్‌లాక్‌ చేసే వీలుంది. ఫింగర్‌ప్రింట్‌, యూఫీ సెక్యూరిటీ ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని బ్లూటూత్‌ సహాయంతో ఆపరేట్‌ చేయవచ్చు. కీప్యాడ్‌ లేదా కీతో ఆపరేట్‌ చేసుకోవచ్చు. ఈ తాళంలో బిల్టిన్‌గా సెన్సర్‌ ఉంటుంది. ఇది డోర్‌ క్లోజ్‌ అయినప్పుడు గుర్తించి, ఆటోమెటిక్‌గా లాక్‌ చేస్తుంది. హర్రీగా ఇంట్లో నుంచి వచ్చేసినా డోర్‌ లాక్‌ మాత్రం సక్సెస్‌ఫుల్‌గా పడుతుంది.



 క్విక్‌సెట్‌ (Quick set smart lock)

వైర్‌లెస్‌ కనెక్టివిటీ లేని లాక్‌ ఇది. లాక్‌ ఉపరితలం గ్లాస్‌ మాదిరిగా ఉంటుంది. కోడ్‌ ఎంటర్‌ చేయడం ద్వారా డోర్‌ అన్‌లాక్‌ అవుతుంది. 16 రకాల వరకు కోడ్స్‌ని ఎంచుకోవచ్చు. అదనపు సెక్యూరిటీ కావాలనుకుంటే మాస్టర్‌ కోడ్‌ ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. ఒకవేళ కరెంట్‌ లేకపోతే 9 వోల్ట్‌ బ్యాటరీ బ్యాకప్‌నిస్తుంది. సింపుల్‌గా ఉండాలి, సూపర్బ్‌గా ఉండాలి అనుకునే వారికి ఈ స్మార్ట్‌లాక్‌ బెస్ట్‌ ఆప్షన్‌. 



యేల్‌ అస్యూర్‌ లాక్‌(Yale smart lock)

ఆటో అన్‌లాక్‌ ఫీచర్‌తో లాక్‌ను అన్‌లాక్‌ చేసుకోవచ్చు. కీప్యాడ్‌తోనూ లాక్‌ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌తో ఉపయోగించవచ్చు. యాపిల్‌ వాచ్‌లో యేల్‌ యాక్సెస్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ద్వారా రిమోట్‌గా లాక్‌, అన్‌లాక్‌ చేసుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా అలెక్సా, సిరి వంటి వాయిస్‌ అసిస్టెంట్లతోనూ లాక్‌ను అనుసంధానించుకోవచ్చు. స్మార్ట్‌ హోమ్‌ సిస్టమ్‌ ఉన్నట్టయితే కనెక్ట్‌ చేసుకోవచ్చు. లాక్‌లో ఇన్‌బిల్ట్‌గా వైఫై బ్రిడ్జ్‌ ఉంటుంది. టైమ్‌ సెట్‌ చేసుకోవడం ద్వారా డోర్‌ మూసుకున్న వెంటనే ఆటోమెటిక్‌గా లాక్‌ అయ్యేలా చేసుకోవచ్చు. ఈ లాక్‌ని సాధారణ డోర్‌లకు కూడా సులువుగా బిగించుకోవచ్చు. 



లాక్‌లీ(Lockly smart lock)

ఫింగర్‌ప్రింట్‌తో పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ ద్వారానూ లాక్‌, అన్‌లాక్‌ చేసే వీలుంది. పాస్‌కోడ్‌ కూడా పెట్టుకోవచ్చు. మెకానికల్‌ కీని కూడా సపోర్టు చేస్తుంది. ఈ స్మార్ట్‌ తాళం యాక్సెస్‌ హిస్టరీని స్టోర్‌ చేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఇంట్లోకి వచ్చి వెళుతున్న వాళ్లను మానిటర్‌ చేయవచ్చు. స్నేహితులు ఇంటికొస్తే స్మార్ట్‌ఫోన్‌లో నుంచి డిజిటల్‌ ఈ-కీని షేర్‌ చేయడం ద్వారా యాక్సెస్‌ను ఇవ్వడానికి వీలవుతుంది.



అల్ట్రా ఎల్‌ఓక్యూ(Ultraloq lock)

ఈ స్మార్ట్‌లాక్‌ ఓపెన్‌ చేసి ఇంట్లోకి ఎవరెవరు ప్రవేశించారో రిమోట్‌గా లాగ్‌ హిస్టరీని చూడొచ్చు. అతిఽథులు వస్తున్నట్లయితే వారి కోసం ప్రత్యేకమైన తేదీల్లో, సమయంలో యాక్సెస్‌ను ఇచ్చేలా సెట్‌ చేసుకోవచ్చు. డోర్‌ ఆటోమెటిక్‌గా లాక్‌ అవుతుంది. ఈ స్మార్ట్‌లాక్‌ అలెక్సా, గూగుల్‌ అసిస్టెంట్‌లతోనూ కనెక్ట్‌ అవుతుంది. యాపిల్‌ వాచ్‌తోనూ ఇది పనిచేస్తుంది. ఫింగర్‌ప్రింట్‌, యాంటీ పీప్‌ కీ ప్యాడ్‌, స్మార్ట్‌ఫోన్‌, ఆటో అన్‌లాక్‌, షేక్‌ టు ఓపెన్‌, మెకానికల్‌ కీ... వంటి రకరకాల పద్ధతుల్లో ఈ స్మార్ట్‌లాక్‌ను ఉపయోగించుకోవచ్చు. 



హాలో టచ్‌ (Halo lock)

ఫింగర్‌ప్రింట్‌తో పనిచేసే స్మార్ట్‌లాక్‌ ఇది. 50 మంది యూజర్ల ఫింగర్‌ప్రింట్లను స్టోర్‌ చేసుకోవచ్చు. కాబట్టి స్నేహితులు, బంధువులతో షేర్‌ చేసుకోవచ్చు. వైఫై కనెక్టివిటీతో పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌తోనూ యాక్సెస్‌ చేసుకోవచ్చు. రిమోట్‌గా ఎలక్ర్టానిక్‌ డెడ్‌బోల్ట్‌ను లాక్‌, అన్‌లాక్‌ చేసుకోవచ్చు. షెడ్యూల్స్‌ సెట్‌ చేసుకోవచ్చు. మీకిష్టమైనప్పుడు ప్రధాన ద్వారం స్టేటస్‌ను చెక్‌ చేసుకోవచ్చు.



సిఫ్లీ(Sifely smart lock)

ఇది 5 ఇన్‌ 1 కీలెస్‌ స్మార్ట్‌లాక్‌. పాస్‌కోడ్‌ని రిమోట్‌గా జనరేట్‌ చేసి షేర్‌ చేయడం ద్వారా ఇంటికొచ్చిన స్నేహితుల కోసం డోర్‌ లాక్‌ ఓపెన్‌ చేయవచ్చు. ఇక ఈ లాక్‌ ఐదు రకాలుగా పనిచేస్తుంది. ఫింగర్‌ప్రింట్‌, కోడ్‌, ఫాబ్‌ కీ, స్మార్ట్‌ఫోన్‌, కీ... ఈ ఐదురకాల్లో దేన్ని ఎంచుకునైనా డోర్‌ లాక్‌, అన్‌లాక్‌ చేసుకోవచ్చు. వైఫైతో కనెక్టివిటీ సాధ్యమే. ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా డోర్‌ లాక్‌ చేసుకోవచ్చు. రిమోట్‌గా కోడ్స్‌ సెట్‌ చేసుకోవచ్చు. రియల్‌టైమ్‌ యాక్సెస్‌ లాగ్స్‌ని చెక్‌ చేసుకోవచ్చు.


Updated Date - 2022-07-31T16:46:13+05:30 IST