‘కువైత్‌’ చేదు జ్ఞాపకాలు మరోసారి..

ABN , First Publish Date - 2022-02-28T12:58:14+05:30 IST

మూడు దశాబ్దాల క్రితం కువైత్‌పై ఇరాక్‌ దాడికి పాల్పడ్డ ఘటన గుర్తుందా! ఆ సంక్షోభ సమయంలో అక్కడ చిక్కుకున్న 1.70 లక్షల మంది భారతీయులను క్షేమంగా వెనక్కి రప్పించేందు కు మన ప్రభుత్వం తీవ్రంగా

‘కువైత్‌’ చేదు జ్ఞాపకాలు మరోసారి..

నాడు 1.70 లక్షల మంది తరలింపు

నేడు ఉక్రెయిన్‌ నుంచి వేలాది మంది

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: మూడు దశాబ్దాల క్రితం కువైత్‌పై ఇరాక్‌ దాడికి పాల్పడ్డ ఘటన గుర్తుందా! ఆ సంక్షోభ సమయంలో అక్కడ చిక్కుకున్న 1.70 లక్షల మంది భారతీయులను క్షేమంగా వెనక్కి రప్పించేందు కు మన ప్రభుత్వం తీవ్రంగా కష్టపడింది. ఇప్పుడు ఉక్రెయిన్‌ లాగే నాడు కూడా కువైత్‌ ఎయిర్‌బేస్‌ మూతపడగా మనవాళ్లను పక్కనే ఉన్న జోర్డాన్‌కు రోడ్డుమార్గం లో తరలించి అక్కడి నుంచి మన విమానాలు క్షేమంగా భారత్‌కు చేర్చాయి. నాటి ఈ ఘటన ప్రపంచంలోనే అతిపెద్ద మానవ తరలింపు ప్రక్రియగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కింది. నేటి ఉక్రెయిన్‌ సంక్షో భ నేపథ్యంలో ఈ ఘటన మరోసారి కళ్ల ముందు కదలాడుతోందని ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ అధికారులు అం టున్నారు. సంఖ్య తక్కువైనా ఇప్పుడు కూడా పరిస్థితి దాదాపు అలాంటిదే అంటున్నారు. సుమారు 20 వేల మంది భారతీయులు ఉక్రెయిన్‌లో ఉన్నారు. అందులో 4 వేల మంది ఇటీవలే భారత్‌కు తిరిగి వచ్చారు. ఇప్పు డు అక్కడి ఎయిర్‌బే్‌సను మూసివేశారన్న సమాచారం అందింది. దీంతో అక్కడ చిక్కుకున్న 16 వేల మందిని వెనక్కి రప్పించేందుకు కేంద్రం తీవ్రంగా కష్టపడాల్సి వస్తోంది. ముందుగా రోడ్డు మార్గంలో ఉక్రెయిన్‌ పొరు గు హంగేరి, పోలాండ్‌, స్లొవేకియా, రొమానియాలకు తరలించి.. అక్కడి నుంచి విమానాల్లో భారత్‌ తీసుకురావాలని ప్రణాళిక రూపొందించింది.




Updated Date - 2022-02-28T12:58:14+05:30 IST