Special Status: ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం: జీవీఎల్‌

ABN , First Publish Date - 2022-07-20T23:44:17+05:30 IST

ప్రత్యేక హోదా (Special Status) ముగిసిన అధ్యాయమని ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు (G V L Narasimha Rao) మరోసారి ప్రకటించారు.

Special Status: ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం: జీవీఎల్‌

ఢిల్లీ: ప్రత్యేక హోదా (Special Status) ముగిసిన అధ్యాయమని ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు (G V L Narasimha Rao) మరోసారి ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో కేంద్రంపై తప్పుడు ప్రచారాల కోసం ప్రయత్నం చేయొద్దని సూచించారు. ప్రత్యేక హోదాపై గతంనే స్పష్టత ఇచ్చామని తెలిపారు. ప్రత్యేక హోదా పై మాట మార్చింది టీడీపీ (TDP), వైసీపేనని విమర్శించారు. రాష్ట్రాల అప్పులకు కేంద్రమే బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. ఏపీ ప్రభుత్వాలు చేసిన తప్పుల వల్ల పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు. ఓబీసీలను కేంద్ర జాబితాలోకి చేర్చే ప్రతిపాదన రాష్ట్రం నుంచి రాలేదని  జీవీఎల్‌ నరసింహరావు తెలిపారు. 


రాష్ట్ర విభజన సమయంలో నవ్యాంధ్రకు ఐదు కాదు, పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీ పట్టుబట్టింది. కానీ... అధికారంలోకి రాగానే ఆ మాట పక్కనపెట్టింది. ఆర్థిక సంఘం సిఫారసుల పేరు చెప్పి హోదాకు సమానమైన ప్రయోజనాలతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. రాష్ట్ర విభజన కష్టాలు, విభజన హామీలు నెరవేర్చుకోవాల్సిన అవసరం, కేంద్ర సహకార ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి టీడీపీ సర్కారు బీజేపీ (BJP) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో సామరస్య ధోరణి ప్రదర్శించింది.

Updated Date - 2022-07-20T23:44:17+05:30 IST