Abn logo
Mar 26 2020 @ 22:41PM

చరణ్‌కి ఫ్యాన్స్ గిఫ్ట్.. బర్త్‌డే స్పెషల్‌ సాంగ్ విడుదల..

హైదరాబాద్: తనదైన స్టైల్ నటనతో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. తొలుత మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. అంచలంచలుగా ఎదుగుతూ వస్తూ.. తనకంటూ ఓ స్టేజీని క్రియేట్ చేసుకున్నాడు. అయితే మార్చి 27వ తేదీన(శుక్రవారం) చరణ్ తన పుట్టినరోజును జరుపుకోనున్నాడు. ఇప్పటికే అభిమానులు చెర్రీ పుట్టినరోజును ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని ఎన్నో ప్లాన్స్‌ వేశారు. కానీ, ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో తన పుట్టినరోజున ఎటువంటి హడావుడి చేయవద్దని చరణ్ తన అభిమానులను ప్రత్యేకంగా కోరాడు. 


అయితే చరణ్ పుట్టినరోజు సందర్భంగా అతని సినిమా పేర్లు, డైలాగ్‌లతో కలిపి ఫ్యాన్స్ ఓ పాటని రూపొందించి విడుదల చేశారు. ఈ పాటని ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్, యాంకర్ అనసూయ తమ సోషల్‌మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ ట్విట్టర్‌లో అడుగుపెట్టడం కూడా మరో విశేషం.



‘‘ఫ్యాన్స్ కోరిక మేరకు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ రూపొందించిన స్పెషల్‌ పాటను విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే, ట్విట్టర్‌కి స్వాగతం’’ అంటూ కాజల్ ట్వీట్ చేసింది. 


‘‘చాలా సంతోషంగా ఉంది. రామ్‌చరణ్ కోసం ఫ్యాన్స్ రూపొందించిన స్పెషల్‌ సాంగ్ ఇది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే రామ్‌చరణ్. ట్విట్టర్‌కి స్వాగతం రామ్’’ అంటూ అనసూయ ట్వీట్ చేసింది. 


ఈ పాటని మధురా ఆడియో లాంచ్ చేయగా.. సురేంద్ర పాడారు. ఈ పాటకి శివ చెర్రీ నిర్మాతగా వ్యవహరించారు.

Advertisement
Advertisement
Advertisement