వైద్యశాలలకు ఉత్తమ సేవా సర్టిఫికెట్‌

ABN , First Publish Date - 2022-05-29T04:20:02+05:30 IST

సంగం ప్రభుత్వ వైద్యశాలలో అందు తున్న ఉత్తమ వైద్య సేవలకుగాను కేంద్రప్రభుత్వం సర్టిఫికేట్‌ అందచేసింది.

వైద్యశాలలకు ఉత్తమ సేవా సర్టిఫికెట్‌
డీఎంహెచ్‌వో నుంచి సర్టిఫికేట్‌ అందుకుంటున్న వైద్యాధికారి ప్రతిమ

సంగం, మే 28: సంగం ప్రభుత్వ వైద్యశాలలో అందు తున్న ఉత్తమ వైద్య సేవలకుగాను కేంద్రప్రభుత్వం సర్టిఫికేట్‌ అందచేసింది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వ వైద్య బృం దం సంగం ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసింది. తనిఖీలో వైద్యశాలల్లో నమోదైయ్యే ఓపీ, వైద్య పరీక్షలు, డెలివరీ తదితర అంశాలను పరిశీలించింది. వైద్యశాలలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విధివిధానాలను పాటిస్తున్నట్లు గుర్తించి నేషనల్‌ క్వాలిటీ అసెస్‌ సర్టిఫికెట్‌కు ఎంపిక చేసింది. ఆ మేరకు జిల్లా కేంద్రానికి వచ్చిన సర్టిఫికెట్‌ను డీఎంహెచ్‌వో పెంచలయ్య స్థానిక వైద్యాధికారి ప్రతిమకు అందజేశారు.

మర్రిపాడు డాక్టర్‌కు ..

మర్రిపాడు :  మండల ప్రాఽథమిక ఆరోగ్యకేంద్రం డాక్టర్‌ వెంకటకిషోర్‌ కు జిల్లా వైధ్యాధికారులు జాతీయ అవార్డును అందించారు.  ఆరోగ్య కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నట్లు గుర్తించి  అ అవార్డు అందజేశారు.



Updated Date - 2022-05-29T04:20:02+05:30 IST