బేతంచెర్ల, మార్చి 6: ఆర్‌ఎస్ రంగాపురం మద్దిలేటి స్వామి దేవస్థానంలో మద్దిలేటి స్వామి, మహాలక్ష్మీదేవి అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి అభిషేకాలు, తల నీలాల సమర్పణ, గండా దీపాలు, ముడుపులు, ఆకుపూజ చేశారు. క్షేత్రంలో సేవా టిక్కెట్లు, లడ్డూ ప్రసాదాల విక్రయం, గది బాడుగలు, విరాళాలు తది తరాల ద్వారా రూ.2,67,456 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో పాండురంగారెడ్డి, చైర్మన్ లక్ష్మిరెడ్డి తెలిపారు.