టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన

ABN , First Publish Date - 2021-02-28T06:16:31+05:30 IST

రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తోందని రాష్ట్ర పోలీసు గృహనిర్మాణ సంస్థ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌పార్టీ రాష్ట్ర కార్య దర్శి, ఉమ్మడిజిల్లా సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి కోలేటి దామోదర్‌ అన్నారు.

టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన
మాట్లాడుతున్న కోలేటి దామోదర్‌

రాష్ట్ర పోలీస్‌ గృహనిర్మాణ సంస్థ చైర్మన్‌ కోలేటి దామోదర్‌

కరీంనగర్‌ టౌన్‌/తిమ్మాపూర్‌, ఫిబ్రవరి 27: రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తోందని రాష్ట్ర పోలీసు గృహనిర్మాణ సంస్థ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌పార్టీ రాష్ట్ర కార్య దర్శి, ఉమ్మడిజిల్లా సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి కోలేటి దామోదర్‌ అన్నారు. శనివారం మంత్రిగంగుల కమ లాకర్‌ క్యాంపు కార్యాలయంలో మేయర్‌ యాదగిరి సునీల్‌రావుతో కలిసి విలేకరులసమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడిజిల్లాలో కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వనమోదు కార్యక్రమం పండుగ వాతావర ణంలో ఉత్సాహంగా జరుగుతోందనిచెప్పారు. సభ్యత్వ నమోదులో కరీంనగర్‌ రాష్ట్రంలోనే నంబర్‌వన్‌ స్థానం లో నిలుస్తుందని, నిలవాలనికాంక్షించారు. మంత్రులు గంగుల కమలాకర్‌, ఈటెల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌పార్టీ సభ్యత్వ నమోదును ఉత్సాహంగా ముం దుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. ఈరోజు వరకు హుజురాబాద్‌లో70వేలు, కరీంనగర్‌లో46వేలు, మాన కొండూర్‌, హుస్నాబాద్‌, చొప్పదండి నియోజకవర్గాల్లో 45వేలచొప్పున సభ్యత్వాలు పూర్తయ్యాయని, మిగిలిన సమయంలో వారికిచ్చిన లక్ష్యాన్ని చేరు కోవాలని సూచించారు.


సభ్యత్వ నమోదుపై సమావేశం..


ఎల్‌ఎండీ కాలనీలోని క్యాంప్‌ కార్యా లయంలో మానకొండూర్‌ ఎమ్మెల్యే రస మయి బాలకిషన్‌ అధ్యక్షతన నియోజక వర్గంలోని టీఆర్‌ఎస్‌ మండల అధ్య క్షులు, జడ్పీటీసీలు,ఎంపీపీలతో సభ్యత్వ నమోదుపై కొల్లేటి దామోదర్‌గుప్త సమావేశం నిర్వహించారు. అనంతరం దామోదర్‌ గుప్తకు ఎమ్మెల్యే రసమయి సభ్యత్వ నమోదు  పుస్తకాలను అందజే శారు. మానకొండూర్‌   నియోజకవర్గంలో  75వేల సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎమ్మెల్యే రస మయి బాలకిషన్‌ తెలిపారు.

  గోదాంగడ్డలో మేయర్‌ యాదగిరి సునీల్‌రావుతోకలిసి కోలేటి దామోదర్‌పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలకు పార్టీ సభ్యత్వాలను అందించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. 37వ డివిజన్‌ మంకమ్మతోటలోని డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి హరిశంకర్‌ మీకోసం కార్యాల యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్ర మాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా భారీసంఖ్యలో యువకులు, మహిళలు పార్టీ సభ్యత్వాలను తీసుకున్నారు.

Updated Date - 2021-02-28T06:16:31+05:30 IST