జాతీయ లోక్‌అదాలత్‌కు విశేష స్పందన

ABN , First Publish Date - 2022-06-27T05:38:15+05:30 IST

రాజంపేటలో జరిగిన లోక్‌ అదాలత్‌ కార్యక్రమానికి ఆదివారం పెద్దఎత్తున ప్రజలు హాజరై పలు కేసులను పరిష్కరించుకున్నారు. రాజంపేట కోర్టు భవనాల సముదాయం లో చెక్‌బౌన్స్‌ కేసులు, సివిల్‌ వాజ్యాలు, చాలా కాలంగా పరిష్కారం కాని కేసులు, లోక్‌ అదాలత్‌ ద్వారా ఇరువర్గాల సమ్మతితో రాజీ అయ్యాయి.

జాతీయ లోక్‌అదాలత్‌కు విశేష స్పందన
రైల్వేకోడూరు న్యాయస్థానంలో లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్న న్యాయమూర్తి అంజనీప్రియదర్శిని

రాజంపేట, జూన్‌ 26: రాజంపేటలో జరిగిన లోక్‌ అదాలత్‌ కార్యక్రమానికి ఆదివారం పెద్దఎత్తున ప్రజలు హాజరై పలు కేసులను పరిష్కరించుకున్నారు. రాజంపేట కోర్టు భవనాల సముదాయం లో చెక్‌బౌన్స్‌ కేసులు, సివిల్‌ వాజ్యాలు, చాలా కాలంగా పరిష్కారం కాని కేసులు, లోక్‌ అదాలత్‌ ద్వారా ఇరువర్గాల సమ్మతితో రాజీ అయ్యాయి. కార్యక్రమంలో జిల్లా అదనపు జడ్జి ఆర్‌.వి.వి.ఎ్‌స.మురళీకృష్ణ, జూనియర్‌ సివిల్‌ జడ్జి సంధ్యారాణి, డీఎస్పీ బాలకృష్ణారెడ్డిలతో పాటు పలువురు సీఐలు, ఎస్‌ఐలు, ఏజీపీలు పాల్గొన్నారు. 


సిద్దవటంలో: జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ ద్వారా 85 కేసులు పరిష్కరించి రూ.10,06,316 రికవరీ చేసినట్లు సిద్దవటం జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస కళ్యాణ్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ సిద్దవటం జూనియర్‌ సివిల్‌ జడ్జి పరిధిలో ఆదివారం జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ను నిర్వహించామన్నారు. కార్యక్రమంలో పీపీ శ్రీనివాసులు, ఏజీపీ సుబ్బారెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రత్నం, లోక్‌ అదాలత్‌ మెంబర్‌ రామదాసు, న్యాయవాదులు పాల్గొన్నారు. 


రైల్వేకోడూరులో: రాజీతోనే రాజ మార్గమని న్యాయమూర్తి అంజనీప్రియదర్శిని తెలిపారు. ఆదివారం రైల్వేకోడూరు న్యాయస్థానంలో మెగా జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ 116 కేసులు పరిష్కారమయ్యాయని, రూ.18 లక్షలు రికవరీ అయినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ కె.విశ్వనాథరెడ్డి, ఎస్‌ఐ-1 ఈవీవీ నరసింహం, ఎస్‌ఐ-2 హేమాద్రి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకట్రామరాజు, ప్రముఖ న్యాయవాదులు ఆర్‌సీ సురే్‌షబాబు, చెంచురామయ్య, సురే్‌షబాబు పాల్గొన్నారు.


నందలూరులో: నందలూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో ఆదివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్‌ అదాలత్‌లో 351 కేసులకు శాశ్వత పరిష్కారం లభించిందని జడ్జి కె.లత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజీమార్గంలో లోక్‌ అదాలత్‌ ద్వారా కక్షిదారులు తమ కేసులకు పరిష్కారం పొందవచ్చన్నారు. తహసీల్దారు ఉదయ శంకర్‌రాజు, ఎస్‌ఐ మైనుద్దీన్‌, న్యాయవాదులు నరసింహులు, ఏవీ సుబ్రహ్మణ్యం, షేక్‌ మహమ్మద్‌ అలీ, సుబ్బరామయ్య, తదితరులు పాల్గొన్నారు.


రాయచోటి(కలెక్టరేట్‌): నేషనల్‌ లోక్‌ అదాలత్‌లో 417 కేసులు పరిష్కరించామని ఐదవ అదనపు జడ్జి షేక్‌.ఇంతియాజ్‌ అహ్మద్‌ తెలిపారు. కక్షిదారులకు రూ.కోటి రెండు లక్షల 553 అవార్డురూపంలో పరిష్కరించామని వారు తెలిపారు. సెకండ్‌ బ్రాంచ్‌ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.ఫాతిమా, అడిషినల్‌  జూనియర్‌ సివిల్‌ జడ్జి డాక్టర్‌ కే.శారద, న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-27T05:38:15+05:30 IST