షాబాద్: కాంగ్రెస్ సభ్యత్వనమోదులు చేస్తున్న జ్యోత్స్నారెడ్డి
షాబాద్/మొయినాబాద్, జనవరి 24: కాంగ్రె్‌సపార్టీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని కాంగ్రె్‌సపార్టీ చేవెళ్ల నియోజకవర్గం పార్టీ సభ్యత్వ ఇన్చార్జి జ్యోత్స్నాశివారెడ్డి అన్నారు. మండలంలోని సోలిపేట్, మద్దూర్, హైతాబాద్, చందన్‌వెళ్లి గ్రామాల్లో టీపీసీసీ కార్యదర్శులు ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి, పీసరి సురేందర్‌రెడ్డి, మాజీ అధికార ప్రతినిధి పామెర భీంభరత్, పార్టీ మండల అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్లతో కలిసి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ద్వారా రూ.2లక్షల జీవితాబీమా కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రాంరెడ్డి, రవీందర్, నర్సింహులు, వెంకట్‌రెడ్డి, చంద్రారెడ్డి, అక్తర్, మహేందర్‌రెడ్డి, పెంటారెడ్డి, ఖుద్దూస్, జంగయ్య, గౌరీశ్వర్, గౌతం, యాదయ్య, బాలయ్య, శ్రీరాములు, అభిలా్‌షరెడ్డి, అరుణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా మొయినాబాద్ మండలంలోని సురంగల్, శ్రీరాంనగర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షాబాద్ దర్శన్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు మానెయ్య, రారెండ్డి, మాధవరెడ్డి, గడ్డవెంకట్రెడ్డి, భూపాల్‌రెడ్డి, బి.వెంకట్‌రెడ్డి, జంగారెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.