ఉచిత వైద్యశిబిరానికి విశేష స్పందన

ABN , First Publish Date - 2021-12-07T05:28:31+05:30 IST

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బద్వేలు అర్బన్‌ పోలీసుస్టేషన్‌ ఆవరణలో అర్బన్‌ సీఐ రామచంద్ర ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది.

ఉచిత వైద్యశిబిరానికి విశేష స్పందన
సీఐ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్న దృశ్యం

బద్వేలు, డిసెంబరు 6 : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బద్వేలు అర్బన్‌ పోలీసుస్టేషన్‌ ఆవరణలో అర్బన్‌ సీఐ రామచంద్ర ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. తొట్టిగారిపల్లె మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వై.చంద్రహాసరెడ్డి, కంటి వైద్యులు డాక్టర్‌ కె.వెంకటేశ్వర్‌రెడ్డి వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, కంటి, రక్త పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోని వారికి టీకా వేశారు. ఉచిత వైద్య శిబిరం మంగళవారం కూడా వుంటుందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

 

Updated Date - 2021-12-07T05:28:31+05:30 IST