రక్తదాన శిబిరానికి విశేష స్పందన: ఎస్పీ సుదీంద్ర

ABN , First Publish Date - 2021-10-19T04:24:11+05:30 IST

మండల కేంద్రంలో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిం చిన రక్తదానశిబిరానికి విశేష స్పందన లభిం చినట్లు ఎస్పీసుదీంద్ర పేర్కొన్నారు. పోలీ సులు మీకోసం కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభిం చారు.

రక్తదాన శిబిరానికి విశేష స్పందన: ఎస్పీ సుదీంద్ర
రక్తదాన శిబిరాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ సుదీంద్ర

వాంకిడి, అక్టోబరు 18: మండల కేంద్రంలో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిం చిన రక్తదానశిబిరానికి విశేష స్పందన లభిం చినట్లు ఎస్పీసుదీంద్ర పేర్కొన్నారు. పోలీ సులు మీకోసం కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన వాంకిడి మండలంలో రక్త దానం చేయడానికి యువతీ,యువకులు ముందుకు రావడం అభినందనీ యమన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో తలసేమియా, కిడ్నీవ్యాధితో బాధ పడుతున్న వారు ఎక్కువమంది ఉండడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. రక్త దానం చేసిన దాతలకు ఈ సందర్భంగా ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్ర మంలో డీఎస్పీ శ్రీనివాస్‌, ఎంపీపీ ముండే విమలాబాయి, సీఐ సుధాకర్‌, ఎస్సై డీకొండ రమేష్‌, సర్పంచు తుకారాం పాల్గొన్నారు.

రెబ్బెన: రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఎస్పీ వైవీఎస్‌ సుదీంద్ర అన్నారు. సోమవారం మం డల కేంద్రంలోని కేకే గార్డె న్స్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సంద ర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదానశిబిరంను ప్రారంభించి మాట్లాడారు. అప్పుడప్పుడు రక్తదానం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచి దన్నారు. పలుమార్లు రక్తదానం చేసిన వినోద్‌జైశ్వాల్‌ను అభినందించారు. ఈసందర్భంగా 160మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌, ఎస్సై భవానీ సేన్‌, జడ్పీటీసీ సంతోష్‌, ఎంపీపీ సౌందర్య, సర్పంచ్‌ సోమశేఖర్‌, ఎంపీటీసీ మధునయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ సంజీవ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

జైనూరు: రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని గ్రంథాలయ చైర్మన్‌ యాదవ్‌ రావు, సీఐహనోక్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో మిత్రా వెల్ఫేర్‌ సోసైటీ ఆధ్వర్యంలో రక్తదానంచేశారు.ఈ సందర్భంగా పలువురు రక్తదానంచేశారు. సోసైటీ సభ్యులు వెంకటేష్‌, లక్ష్మణ్‌, హన్నుపటేల్‌, శంకర్‌, సర్పంచ్‌లుభీంరావు,శ్యాంరావు, పార్వతీబాయి, ఎస్సైలు, ఏఎస్సైలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T04:24:11+05:30 IST