గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2022-08-07T05:30:00+05:30 IST

గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు

గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు
నల్ల, ఎర్రపోచమ్మ అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి

  • పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

ఘట్‌కేసర్‌, ఆగస్టు 7 : పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడలో నూతనంగా నిర్మించిన నల్లపోచమ్మ, ఎర్రపోచమ్మ ఆలయాల్లో ప్రతిష్ఠించిన అమ్మవార్లకు ప్రత్యేక పూజాలు నిర్వహించారు. ఈమేరకు ఆదివారం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అమ్మవార్లను దర్శించుకున్నారు. అన్నోజిగూడలో మున్సిపల్‌ చైర్మన్‌, బొయపల్లి కొండల్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ రెడ్డియానాయక్‌, స్థానిక పెద్దలు సమిష్టిగా మహంకాళి, నల్లపోచమ్మ, ఎర్రపోచమ్మ ఆలయాలను నిర్మించారు. ఇందులో భాగంగా వారం రోజలుగా విగ్రహ ప్రతిష్ఠ పూజలు నిర్వహిస్తున్నారు. ఆదివారం మంత్రి మల్లారెడ్డి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు జడ్పీచైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి, మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పావని, సత్తిరెడ్డి, కౌన్సిలర్లు మహేష్‌, ధనలక్ష్మి, రాజశేఖర్‌, సాయిరెడ్డి, బాల్‌రెడ్డి, వెంకటే్‌షగౌడ్‌, సుర్వీ రవీందర్‌, లక్ష్మి, హిమ, నాయకులు శేఖర్‌, శ్రీనివా్‌సరెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, దయాకర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, చిన్న నర్సింహ, శ్రీశైలం, లక్ష్మీనారాయణ, జితేందర్‌, దర్శన్‌, శంకర్‌, రాజేశ్వర్‌రెడ్డి, గోవింద్‌, మల్లారెడ్డి, అన్నదాతలు గోపు మారెడ్డి, సాగర్‌రెడ్డి, ప్రదీ్‌పరెడ్డి, తధితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-07T05:30:00+05:30 IST