నరసింహస్వామికి ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2022-08-13T05:30:00+05:30 IST

గుర్రంకొండ మండలం తరిగొండ లక్ష్మీనర సింహస్వామి ఆలయంలో శ్రావణ శనివారం సందర్భంగా స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు.

నరసింహస్వామికి ప్రత్యేక పూజలు
ఆంజనేయ స్వామికి పూజలు చేస్తున్న భక్తులు

గుర్రంకొండ, ఆగస్టు 13:గుర్రంకొండ మండలం తరిగొండ లక్ష్మీనర సింహస్వామి ఆలయంలో శ్రావణ  శనివారం సందర్భంగా స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఉత్సవమూ ర్తులను సర్వాంగసుందరంగా అలంకరించారు.  అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.

పెద్దతిప్పసముద్రంలో : మండలంలోని వివిధ ఆలయాల్లో శ్రావణ మాస శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక చెన్నకేశ వస్వామి ఆలయంలో స్వామి వారికి అభిషేక పూజలు, ప్రత్యేక పూజలు,  నిర్వహించారు. ఎగువపల్లె గ్రామానికి చెందిన రామచంద్ర కుటుంబీకుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.  భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

బి.కొత్తకోటలో: శ్రావణ  శనివా రం సందర్భంగా మండలంలోని వివిధ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బి.కొత్తకోటలోని ఆంజనేయ స్వా మి ఆలయం, శివాలయం, చెన్న కేశవాలయం, బీసీ కాలనీ లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బడికాయ లపల్లె పంచా యతీలోని వలసగు ట్టపల్లె సమీపంలోని గొల్లల చెరు వు కట్టపై వెలసిన లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో అభిషేక పూజలు నిర్వహిం చారు. గుడిపల్లె గ్రామ పంచాయతీ ఠానా మిట్ట సమీపంలో గల ఆవులకొండరాయు డు ఆలయంలో వెంకట్రమణ స్వా మికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు.  మండల సరిహద్దు సమీపంలోని కర్ణాటక లోని కూరిగేపల్లె వద్దగల కంభంబోడు గుట్టపై వెలసిన ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారిని విశేష అలంకరణతో ముస్తాబు చేసి అభిషేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని పుష్పపల్లకీపై ఊరేగించారు. అనంతరం అన్నదానం చేశారు. 

 వైభవంగా శ్రావణ శనివార పూజలు 


మదనపల్లె, అర్బన్‌, ఆగస్టు 13: పట్టణంలో శ్రావణమాసం శనివారం పురస్కరించుకుని పలు ఆలయాల్లో  ప్రత్యేక పూజలు నిర్వ హించారు. దేవళంవీధిలోని ప్రసన్నవెంకట రమణస్వామి ఆలయంలో ఉదయాన్నే స్వామివారికి  ఆలయ ఈవో రమణ ఆధ్వ ర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని నారాయణ పారాయణం చేశారు. కాగా భక్తిశ్రద్ధలతో భక్తులు బసినికొండ మెట్లు ఎక్కి స్వామివారి పాదాలను దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. మెట్లువద్ద పెద్దఎత్తున్న భక్తులకు అన్నదానం చేశారు. 


Updated Date - 2022-08-13T05:30:00+05:30 IST