మెస్రం వంశీయుల ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2022-01-29T06:27:41+05:30 IST

నాగోబా జాతరలోని మర్రి చెట్టు వద్దకు చే రుకున్న మెస్రం వంశీయులు శుక్రవారం సంప్రదాయ పూజలను ని ర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నా రు. ఇంద్రయిదేవతకు పూజలు చే సి కేస్లాపూర్‌ చేరుకున్న మెస్రం వంశీయులను స్థానిక గిరిజనులు ఘనంగా స్వాగతించారు. మెస్రం వంశీయులు ఎడ్లబండ్ల ద్వారా కొం దరు, కాలినడకన మరికొందరు తరలివచ్చారు. మర్రిచెట్టు వద్ద ఏర్పాటు చే సుకున్న గుడారాలలో నిద్రిస్తున్న గిరిజనులు

మెస్రం వంశీయుల ప్రత్యేక పూజలు
సుదూర ప్రాంతాల నుంచి మర్రిచెట్టు వద్దకు చేరుకున్న మెస్రంలు

ఇంద్రవెల్లి, జనవరి 28: నాగోబా జాతరలోని మర్రి చెట్టు వద్దకు చే రుకున్న మెస్రం వంశీయులు శుక్రవారం సంప్రదాయ పూజలను ని ర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నా రు. ఇంద్రయిదేవతకు పూజలు చే సి కేస్లాపూర్‌ చేరుకున్న మెస్రం వంశీయులను స్థానిక గిరిజనులు ఘనంగా స్వాగతించారు. మెస్రం వంశీయులు ఎడ్లబండ్ల ద్వారా కొం దరు, కాలినడకన మరికొందరు తరలివచ్చారు. మర్రిచెట్టు వద్ద ఏర్పాటు చే సుకున్న గుడారాలలో నిద్రిస్తున్న గిరిజనులు పూజా సామానులను వెదురు బుట్టల్లో తెచ్చి గూడారాల సమీపంలో బండలపై పేర్చి ఉంచారు. మర్రి చెట్టు వద్ద బస చేసిన మెస్రం వంశీయులకు మెస్రం ప్రధాన్‌ క్రిక్రి వాయి స్తు నాగోబా కథను పాట రూపంలో వినిపిస్తున్నారు. సిరికొండ మండల కేంద్రంలో తయారు చేయించిన కొత్తకుండలను కొనుగోలు చేయడానికి కొందరు మెస్రం వంశీయులు బయలుదేరారు.

నేడు తూం పూజలు 

మెస్రం వంశీయులలో చనిపోయిన వారికి శనివారం మర్రి చెట్టు వద్ద  తూం(కర్మకాండ) పూజలు నిర్వహించనున్నారు. మెస్రం వంశీయులలో చనిపోయిన వారికి ఎవరైన కర్మకాండలు జరపక పోతే నాగోబా చెంత ఉన్న మర్రి చెట్టు వద్ద పూజలు చేయడం మెస్రం గిరిజనుల ఆనవాయితీ. 

మెస్రం పటేల్‌లకు ఘన స్వాగతం 

పవిత్ర గంగాజలంతో మెస్రం వంశీయులు మర్రి చెట్టు వద్దకు గురువారం రాత్రి చేరుకోగా శుక్రవారం రాత్రి ఆయా గ్రామాల నుంచి వస్తున్న మెస్రం పటేళ్లకు స్థానిక మెస్రం వంశీయులు ఘన స్వాగతం పలకుతునా రు. ఆలయ పీఠాదిపతి వెంకట్‌రావును సాంప్రదాయ వాయిద్యాలతో మర్రి చెట్టు వద్దకు తీసుక వచ్చారు. కాగఢ హారతి పట్టి స్వాగతం పలికారు. మ హిళలు, పురుషులు వేర్వేరుగా సమావేశ మయ్యారు. శనివారం నిర్వహించ నున్న తూం పూజలు, 31న నిర్వహిచనున్న మహాపూజలపై చర్చించారు.

నాగోబా జాతరకు కేటీఆర్‌కు ఆహ్వానం

ఉట్నూర్‌, జనవరి 28: ఈనెల 31 నుంచి ప్రారంభం కానున్న ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ నాగోబా జాతరకు రావాలని మంత్రి కేటీఆర్‌ను నాగో బా వంశీయుల తరపున నాగోబా పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు అనుమతితో శుక్రవారం ప్రగతి భవన్‌లో ఆహ్వానించడం జరిగిందని మత్తడి గూడ రాయిసెంటర్‌ సార్‌మేడి నైతం చిత్రు, ఉట్నూర్‌ ఎంపీపీ పంద్ర జైవంత్‌రావులు తెలిపారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో ఆయనను ఎమ్మెల్యే రేఖానాయక్‌, ఏఎంసీ చైర్మన్‌ జాదవ్‌ శ్రీరాం నాయక్‌ ఆధ్వర్యంలో కలవడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆదివాసీ అడవి ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు బీటీ రోడ్లు, విద్యుత్‌ సరఫరా, త్రీఫేజ్‌ సౌకర్యాలు కల్పించాలని, మత్తడిగూడకు చెందిన సిడాం శంభు స్మారక భవనం మత్తడిగూడలో మంజూరు చేయాల ని, అర్హులైన ఆదివాసులకు అటవీ హక్కు పత్రాలు అందించాలని కోరామన్నారు. వీరివెంట రాయిసెంటర్‌ సభ్యులు సిడాం సోనేరావు, కుడిమెత మారుతి, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు దాసండ్ల ప్రభాకర్‌, ఉట్నూర్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, దరణీ రాజేష్‌, తదతరులు ఉన్నారు.

Updated Date - 2022-01-29T06:27:41+05:30 IST