భక్తిశ్రద్ధలతో హనుమాన్‌ జయంతి

ABN , First Publish Date - 2022-05-26T05:27:10+05:30 IST

జిల్లా వ్యాప్తంగా హనుమాన్‌ జయంతి వేడుకలను బుధ వారం ఘనంగా నిర్వహించుకున్నారు.

భక్తిశ్రద్ధలతో హనుమాన్‌ జయంతి
పుల్లూరులో హనుమాన్‌ విగ్రహంతో నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు

- ఆంజనేయుడికి భక్తుల ప్రత్యేక పూజలు

- పలు గ్రామాల్లో వైభవంగా శోభాయాత్ర

గద్వాల/ వడ్డేపల్లి/ అలంపూర్‌/ అయిజ/ రాజోలి/  ఉండవల్లి/ అలంపూర్‌ చౌరస్తా/ మానవపాడు, మే 25 : జిల్లా వ్యాప్తంగా హనుమాన్‌ జయంతి వేడుకలను బుధ వారం ఘనంగా నిర్వహించుకున్నారు. గద్వాల మండలం లోని సంగాల గ్రామంలో రైల్వే కాంట్రాక్టర్‌ అయ్యపురెడ్డి ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన అతిథులకు అయ్యపు రెడ్డి ప్రసాదా లను అందించి శాలువాలతో సత్కరించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. 


- వడ్డేపల్లి మండల పరిధిలోని కొంకలలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఉదయం స్వామి వారికి ఆకుపూజ, పంచామృతాభిషేకం చేశారు. సాయంత్రం స్వామివారి ఊరేగింపు, రాత్రి ఏడు గంటలకు ప్రత్యేక భజన కార్యక్రమం నిర్వహించారు.


- అలంపూర్‌ పట్టణంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి అర్చకు లు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పాత ఆసుపత్రిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో మహిళలు పూజలు చేశా రు. న్యూప్లాట్స్‌ కాలనీలోని ఆలయంలో దాతల సహకారంతో అన్నదానం చేశారు.


- రాజోలి మండలంలోని పెద్దతాండ్రపాడులోని ఆంజనేయస్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. రాజోలిలోని ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి తుంగభద్ర నీటితో అభిషేకం చేశారు. అనంతరం అంజన్నకు మంగళహారతులు ఇచ్చి, స్వామి వారి విగ్రహంతో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.


- ఉండవల్లి మండల కేంద్రంతో పాటు, డీ బూడిద పాడు, కంచుపాడు, తక్కశిల, ప్రాగటూర్‌ తదితర గ్రామా ల్లో బుధవారం ఆంజనేయస్వామి జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. డీ బూడిదపాడులోని ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులకు ఏజీఆర్‌ పంక్షన్‌ హాల్‌ యజమాని అన్నదానం చేశారు. ప్రాగటూర్‌ నుంచి హను మాన్‌ భక్తులు డీ బూడిదపాడు ఆంజనేయస్వామి ఆలయం వరకు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహిం చారు. తక్కశిల, కంచుపాడు, ప్రాగటూర్‌ గ్రామాల్లో హనుమాన్‌ శోభాయాత్ర నిర్వహించారు.


- హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని ఉండవల్లి మండలంలోని పుల్లూరులో శోభాయాత్ర నిర్వహించారు. ప్రత్యేకంగా ఆలంకరించిన ట్రాక్టర్‌లో హనుమాన్‌ చిత్రపటాన్ని ఉంచి పూలమాలతో ఆలంకరించి, రథయాత్ర నిర్వహించారు. అంజనేయస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.


- మానవపాడు మండల పరిధిలోని చెన్నిపాడులో గ్రామంలో ఘనంగా శోభాయాత్ర చేపట్టారు. హిందూ ధార్మిక సంస్థ ప్రతినిధి నరసింహులు, యువరామసేతు సభ్యుడు కురుమన్న, వెంకటేష్‌, లక్ష్మీనారాయణ, వెంకటపతి, పురుషోత్తం ఆధ్వర్యంలో హనుమాన్‌ చిత్రపటాన్ని పూలమాలతో ఆలంకరించి రథయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు గోవర్ధన్‌, భాస్కర్‌, ఈరన్న, బీ గోవర్ధన్‌, సీ వెంకటేష్‌, వంశీ, మధు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.


హిందూ సంప్రదాయ విలువలను గౌరవిద్దాం

హిందూ సాంప్రదాయ విలువలను గౌరవిద్దామని జిల్లా బీజేపి అధ్యక్షులు రామచంద్రారెడ్డి అన్నారు. బుదవారం హనుమాన్‌ జయంతి సందర్భంగా అయిజ మండల పరిధిలోని తొత్తినోనిదొడ్డిలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ.. ప్రతీ వ్యక్తి భక్తి భావం కలిగి ఉండాలని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు తూముకుంట అంజి, రాజేష్‌గౌడు, నర్సన్‌గౌడు పాల్గొన్నారు. పర్దిపూర్‌ గ్రామంలో టీఆర్‌ఎస్‌ నాయకులు కుర్వ మాణిక్యం అధ్వర్యంలో హనుమాన్‌ జయంతి వేడుకలు నిర్వహించారు.


Updated Date - 2022-05-26T05:27:10+05:30 IST