Advertisement
Advertisement
Abn logo
Advertisement

జిల్లావ్యాప్తంగా దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

సూర్యాపేట కల్చరల్‌  / కోదాడ టౌన్‌ / హుజూర్‌నగర్‌ / హుజూర్‌నగర్‌ రూరల్‌ / నేరేడుచర్ల / చిలుకూరు / కోదాడ రూరల్‌ / చిలుకూరు, అక్టోబరు 14 : దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారు గురువారం మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లాకేంద్రంలోని శ్రీ సంతోషిమాత, అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి ఆలయాలతో పాటు పలు మండపాల్లో ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు చేశారు. 22,40వార్డుల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నదానం చేశారు. 14వ వార్డు లో కౌన్సిలర్‌ సలిగంటి సరిత వీరేంద్ర ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. కోదాడ పట్టణంలోని నయానగర్‌, 28వ వార్డులో కాలనీవాసులు అమ్మవారికి కుం కుమ పూజ, అభిషేకాలు నిర్వహించారు. హుజూర్‌నగర్‌ పట్టణంలోని దుర ్గమ్మ ఆ లయంలో కుంకుమ పూజలు, అభిషేకాలు చేశారు. హు జూర్‌నగర్‌  పట్టణంలోని 22వ వార్డులో గల ఎన్‌ఎ్‌సపీ క్యాంపు, మండల పరిధిలోని బూరుగడ్డ, వేపలసింగారంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సం దర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. నేరేడుచర్ల పట్టణంలో అమ్మవారు దుర్గామాతగా దర్శనమిచ్చారు. చిలుకూరు మండలంలోని బేతవోలు గ్రామంలో న్యూ నె మ్మాది గురవయ్య మెమోరియల్‌ యూత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోలాట పోటీ లు రెండోరోజూ కొనసాగాయి. కోదాడ మండల పరిధిలో ని నల్లబండగూడెం, చింతలపాలెం  మం డల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో అన్నదానం చేశారు. 

Advertisement
Advertisement